TSPSC Group 3 Exam Dates Announced
TSPSC Group 3 Exam Dates : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-III సర్వీసెస్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్ III ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ” పరీక్ష రోజున ఉదయం 08.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తారు. ఉదయం 09.30 గంటలకు గేటు మూసివేస్తారు. అదే రోజు మధ్యాహ్నం సెషన్‌కు 1:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
అదే సెషన్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు గేట్లు మూసివేసిన తర్వాత ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించరు. గ్రూపు 3 పరీక్ష నవంబర్ 17, నవంబర్ 18 తేదీలలో నిర్వహించనున్నారు. నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లు ఉంటాయి. నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక సెషన్ ఉంటుంది. నవంబర్ 10, 2024 నుంచి టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 3 2024 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా :
తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్, ప్రశ్నాపత్రాలను అన్ని సెషన్ల నుంచి తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. అవసరమైతే వాటిని చూపించవలసి ఉంటుంది. డూప్లికేట్ హాల్ టికెట్ తరువాత జారీ చేయరని గమనించాలి.