UGC NET 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సెషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఈరోజు, డిసెంబర్ 10, 2024న ముగియనుంది. అభ్యర్థులు యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in)లో 11.50 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష ఫీజును డిసెంబర్ 11, 2024లోపు (రాత్రి 11:50 గంటల వరకు) చెల్లించవచ్చు.
యూజీసీ నెట్ 2024 డిసెంబర్ : ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 : దరఖాస్తు రుసుము
జనరల్/అన్ రిజర్వ్డ్: రూ 1150
జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్: రూ. 600
ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూడీ, థర్డ్ జెండర్: రూ 325
డిసెంబర్ 2024 యూజీసీ నెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి :
యూజీసీ నెట్ 2024 (ugcnet.nta.ac.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
హోమ్‌పేజీలో “UGC-NET డిసెంబర్-2024 : రిజిస్టర్/లాగిన్ చేసేందుకు క్లిక్ చేయండి” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్తగా ఓపెన్ చేసిన పేజీలో, కొత్త రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసే అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
సిస్టమ్ రూపొందించిన రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
నెట్ 2024 డిసెంబర్ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. దరఖాస్తు రుసుమును చెల్లించండి.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేయండి.