UGC NET Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఎగ్జామ్ రీషెడ్యూల్..!

UGC NET Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముందుగా జనవరి 15 పరీక్షను జనవరి 21 నుంచి జనవరి 27, 2025కి వాయిదా వేసింది.

UGC NET Admit Card

UGC NET Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నెట్ 2024 రీషెడ్యూల్ చేసిన పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పొంగల్, మకర సంక్రాంతి పండుగల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముందుగా జనవరి 15 పరీక్షను జనవరి 21 నుంచి జనవరి 27, 2025కి వాయిదా వేసింది. ఈ పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in) నుంచి తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : UGC NET 2024 Schedule : యూజీసీ నెట్ 2024 సెషన్ రీషెడ్యూల్ ఇదిగో.. కొత్త తేదీలివే!

“14.01.2025 పబ్లిక్ నోటీసు ద్వారాలో సవరించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. 21.01.2025 నుంచి 27.01.2025న షెడ్యూల్ చేసిన యూజీసీ – నెట్ డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల అయింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అండర్‌టేకింగ్‌తో పాటు వారి అడ్మిట్ కార్డ్‌ను (దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని ఉపయోగించి) డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది” అని అధికారిక నోటీసు పేర్కొంది.

యూజీసీ-నెట్ 2024 OMR (పెన్-పేపర్) ఫార్మాట్ ఉపయోగించి దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో 85 సబ్జెక్టుల కోసం నిర్వహించనుంది. రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయండి :

  • యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌ (ugcnet.nta.ac.in)ను విజిట్ చేయండి.
  • హోమ్ పేజీలో, “UGC-NET డిసెంబర్-2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసేందుకు ‘‘Click Here’’ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇచ్చిన సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయండి
  • సబ్మిట్ (Submit)పై క్లిక్ చేయండి. మీ యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షా విధానం :
ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 100 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. అవెర్‌నెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఎబిలిటీ వంటి సాధారణ నైపుణ్యాలను కలిగి ఉండాలి. పేపర్ 2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.

జూన్, డిసెంబర్ నెలలో భారతీయ యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం అర్హులు కావాలనుకునే అభ్యర్థులకు జేఆర్ఎఫ్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే వారికి యూజీసీ నెట్ సర్టిఫికేట్ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చర్‌షిప్ పోస్ట్ సర్టిఫికేట్ పొందవచ్చు.

Read Also : UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఏయే తేదీల్లో పరీక్ష జరగనుందంటే?