UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఏయే తేదీల్లో పరీక్ష జరగనుందంటే?
UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డ్‌లు ప్రస్తుతం ఈ తేదీలలో షెడ్యూల్ చేసిన పరీక్షలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

UGC NET 2024 Admit Card
UGC NET 2024 Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా (UGC NET) డిసెంబర్ 2024 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. జనవరి 3, 6, 7, 8 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే, యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్‌లు ప్రస్తుతం ఈ తేదీలలో షెడ్యూల్ చేసిన పరీక్షలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గమనించాలి. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షలు జనవరి 3, 2025న ప్రారంభం కాగా జనవరి 16, 2025 వరకు జరుగనున్నాయి. ఇతర తేదీలలో షెడ్యూల్ చేసిన పరీక్షల అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల కానుందని అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.
Read Also : UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల.. వచ్చే జనవరి 3నే పరీక్ష..
పరీక్ష షెడ్యూల్, ఫార్మాట్ :
యూజీసీ నెట్ పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇందులో ఆబ్జెక్టివ్-టైప్ మల్టీ ఆప్షనల్ ప్రశ్నలతో రెండు సెక్షన్లు ఉంటాయి. ముఖ్యంగా, సెక్షన్ల మధ్య గ్యాప్ ఉండదు. లాంగ్వేజీ-నిర్దిష్ట సబ్జెక్టులు మినహా ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వారి యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in)ను విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపించే డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్తగా ఓపెన్ అయిన పేజీలో మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత (Submit)పై క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేయండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.
అభ్యర్థులకు సపోర్టు :
యూజీసీ నెట్ అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు లేదా వ్యత్యాసాలను గమనిస్తే సాయం కోసం 011-40759000 లేదా (ugcnet@nta.ac.in) ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక (UGC NET 2024) వెబ్‌సైట్‌ను చెక్ చేయొచ్చు.
Read Also : UGC NET December 2024 : ఈ నెల 3 నుంచే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సెషన్.. ఎగ్జామ్ గైడ్‌లైన్స్ మీకోసం..