Union Bank of India has released a notification for 250 posts.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (వెల్త్ మేనేజర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 25తో గడువు ముగియనుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ unionbankofindia.co.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన/ నియంత్రణ సంస్థలచే ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుండి MBA/MMS/PGDBA/PGDBM/PGPM/PGDMలో 2 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ.177, మిగతా అన్ని వర్గాల వారు రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఈ పోస్టులకు ఎంపిక నాలుగు విభాగాలుగా జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష, సమూహ చర్చ, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి.