RRB Exam Date: RRB అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్‌లోడ్ ఇలా..
ఎగ్జామ్ సెంటర్ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని బోర్డు తన అధికారిక నోటీసులో తెలిపింది.

RRB Exam Date: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ పరీక్ష తేదీ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. CBT-II పరీక్ష అక్టోబర్ 13, 2025న జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcd.gov.inలో పూర్తి నోటిఫికేషన్‌ను చెక్ చేయొచ్చు.
RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష: CBT-II పరీక్ష షెడ్యూల్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
* అధికారిక వెబ్ సైట్ rrbcd.gov.in కి వెళ్లాలి.
* హోమ్ పేజీలో RRB NTPC CBT-II Tentative Schedule 2025 పై క్లిక్ చేయాలి.
* ఆటోమేటిక్ గా ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్ లోడ్ అవుతుంది.
* తదుపరి రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి.
ఎగ్జామ్ సెంటర్ తదితర వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని బోర్డు తన అధికారిక నోటీసులో తెలిపింది. అభ్యర్థులు అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వివరాలను తనిఖీ చేయగలరు. పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్ సైట్ లో కాల్ లెటర్/ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎందుకంటే అది లేకుండా వారిని లోపలికి అనుమతించరు.
వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది.