గ్రూప్ 2 మరో విడత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థుల వివరాలు ఇందులో తెలుసుకోండి..

అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

గ్రూప్ 2 మరో విడత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థుల వివరాలు ఇందులో తెలుసుకోండి..

TGPSC

Updated On : September 21, 2025 / 3:23 PM IST

TGPSC Group 2: గ్రూప్ 2 మరో విడత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 24 వరకు గ్రూప్ 2 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది.

ఆయా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ వివరించింది. (TGPSC Group 2)

Also Read: వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. సంచలన కామెంట్స్‌

అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో (websitenew.tgpsc.gov.in/) తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సర్టిఫికెట్లలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెల 25న రిజర్వ్ డే ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది.