వెనకబడిన అగ్రవర్ణాలకు కొత్తగా 2.14 లక్షల సీట్లు

158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

  • Publish Date - April 16, 2019 / 06:11 AM IST

158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (EWS‌) 10 శాతం రిజర్వేషన్ల అమలులో భాగంగా 158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లను 25 శాతం పెంచనున్నట్లు 2019–20 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్‌ అమలు కోసం 158 కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలకు రూ.4,315 కోట్ల నిధులు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Read Also : తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో మార్పులు చేయకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్‌ కల్పించేలా కేంద్రం ఈ ఏడాది మొదట్లో కొత్త చట్టం తీసుకు వచ్చింది. ఈ కొత్త రిజర్వేషన్ల వల్ల జనరల్‌ కోటాలోనూ సీట్లు తగ్గకుండా చూడటం కోసం కొత్తగా 2,14,766 సీట్లను సృష్టించనున్నారు.

ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపేముందే మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకుంది. 2019–20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లను, 2020–21లో 95,783 సీట్లను ప్రభుత్వం సృష్టించనున్నారు. 
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్