UP NEET PG Counselling : యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ రీఓపెన్.. పూర్తివివరాలివే..!

UP NEET PG Counselling : జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు 15 పర్సంటైల్ అంతకంటే ఎక్కువ సాధించాలి.

UP NEET PG Counselling

UP NEET PG Counselling : ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DGME), ఉత్తరప్రదేశ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ విండోను ఈరోజు (డిసెంబర్ 9న) తిరిగి ఓపెన్ చేసింది.

ఎంసీసీ ఇటీవల నీట్ పీజీ 2024 క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సంటిల్‌ను తగ్గించిన తర్వాత వస్తుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఇప్పుడు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు 15 పర్సంటైల్ అంతకంటే ఎక్కువ సాధించాలి.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 10 పర్సంటైల్ సాధించాలి. అవసరమైన పర్సంటైల్ స్కోర్ చేసిన అభ్యర్థులు, వివిధ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు యూపీ నీట్ పీజీ 2024 కోసం అధికారిక వెబ్‌సైట్ (upneet.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ జనవరి 13 ఉదయం 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 డాక్యుమెంట్లు అవసరం :
కేటాయించిన కాలేజీ అభ్యర్థులకు నివేదించే ముందు అవసరమైన డాక్యుమెంట్లను జాబితాను రివ్యూ చేయొచ్చు.

  • నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డ్
  •  నీట్ పీజీ 2024 రిజల్ట్స్/స్కోర్‌కార్డ్
  •  యూపీ నీట్ 2024 కౌన్సెలింగ్ దరఖాస్తు ఫారమ్ కాపీ
  •  క్లాస్ 10 సర్టిఫికేట్ (పుట్టినరోజు ఫ్రూప్)
  •  ఎంబీబీఎస్ మార్క్ షీట్లు (అన్నీ)
  •  పాస్ సర్టిఫికేట్ (ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సు)
  •  ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్
  •  ఎంసీఐ/ఎస్ఎంసీ జారీ చేసిన పర్మినెంట్/ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  •  వైకల్యం సర్టిఫికేట్ (వర్తిస్తే)
  •  క్యాస్ట్/కమ్యూనిటీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 ఎలా దరఖాస్తు చేయాలి? : 

  • అధికారిక వెబ్‌సైట్ (upneet.gov.in)ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, పీజీని ఎంచుకోండి.
  • ఇప్పుడు, కోర్సును ఎంచుకుని, నీట్ పీజీ 2024 రోల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. ఆపై సమర్పించండి.
  • కన్ఫార్మ్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 ఫీజు వివరాలివే :
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 3వేలు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ సీట్లకు (MD, MS, Diploma, DNB కోర్సులు) సెక్యూరిటీ డిపాజిట్ రూ. 30వేలు, ప్రైవేట్ రంగ మెడికల్ సీట్లకు (ఎండీ, ఎంఎస్ కోర్సులు) రూ. 2లక్షలు, ప్రైవేట్ డెంటల్ కాలేజీలకు సెక్యూరిటీ మొత్తం రూ.లక్ష చెల్లించాలి.

Read Also : CTET Result 2024 : సీబీఎస్ఈ సీటెట్ రిజల్ట్స్ 2024 విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!