UP Police Constable Result : త్వరలో యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలివే!

యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2024 : పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీపీఆర్‌పీబీ అధికారిక వెబ్‌సైట్ (uppbpb.gov.in) ద్వారా రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UP Police Constable Result 2024

UP Police Constable Result : యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2024 : ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ బోర్డ్ (UPPRPB) యూపీ పోలీస్ కానిస్టేబుల్ 2024 పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీపీఆర్‌పీబీ అధికారిక వెబ్‌సైట్ (uppbpb.gov.in)ని విజిట్ చేయడం ద్వారా రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఫలితాలను యాక్సెస్ చేసేందుకు దరఖాస్తుదారులు తమ లాగిన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

  • అధికారిక వెబ్‌సైట్ (uppbpb.gov.in)కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2024 లింక్‌ క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • రిజల్ట్స్ పీడీఎఫ్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం రిజల్ట్స్ హార్డ్ కాపీని తీసుకోండి

కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి ఎంపిక రాత పరీక్షతో ప్రారంభించి అనేక దశల్లో కొనసాగుతుంది. అర్హత పొందిన అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌కు ఎంపిక అవుతారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. 2024 ఆగస్టు 23, 24, 25, 30, 31 తేదీల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో సహా కట్టుదిట్టమైన భద్రతతో 67 జిల్లాల్లోని 1,174 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.

గతంలో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించగా పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేశారు. రద్దు తర్వాత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరు నెలల్లోగా కొత్తగా పారదర్శక నియామక ప్రక్రియను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని 2,835 కేంద్రాల్లో ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ పరీక్షకు 16 లక్షల మంది మహిళలు సహా 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Read Also : Google Chrome Feature : గూగుల్ క్రోమ్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఈ కొత్త ఫీచర్ వెబ్ పేజీలో ఆర్టికల్స్ చదివి పెడుతుంది..!