UPSC Civil Services Prelims Exam 2025 Registration
UPSC Prelims Exam 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025 దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. ఇప్పుడు ఆసక్తిగల అభ్యర్థులు ఈ రెండు పరీక్షలకు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, గతంలో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2025గా నిర్ణయించారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)ని విజిట్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత యూపీఎస్సీ దరఖాస్తు ఎడిట్ విండో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లోని కొన్ని విషయాలను సరిదిద్దుకోవచ్చు. ఎడిట్ విండో ఫిబ్రవరి 19న మొదలై ఫిబ్రవరి 25, 2025న క్లోజ్ అవుతుంది.
యూపీఎస్సీ జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం.. ‘సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2025 కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని ఫిబ్రవరి 18, 2025 (సాయంత్రం 6 గంటలకు) వరకు పొడిగించారు’ అని పేర్కొంది.
దాంతో పాటు, అప్లికేషన్ విండో ముగిసిన మరుసటి రోజు నుంచి అంటే.. 19 ఫిబ్రవరి 2025 నుంచి 25 ఫిబ్రవరి 2025 వరకు 7 రోజుల గడువు ముగిసే వరకు 7 రోజుల ఎడిట్ విండో ఇప్పుడు అందుబాటులో ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు (upsc.gov.in)ని విజిట్ చేయడం ద్వారా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, దరఖాస్తు చేసే ముందు వారు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఓటీఆర్ ప్రొఫైల్ లైఫ్ టైమ్ చెల్లుతుంది. ఇప్పటికే ప్రొఫైల్ క్రియేట్ చేసిన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయొచ్చు.
Read Also : Vastu Shastra : వాస్తుశాస్త్రం ప్రకారం.. ఈ 8 వస్తువులను ఎప్పుడూ ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వకూడదు..!
యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2025 ఎలా దరఖాస్తు చేయాలి? :
యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2025 దరఖాస్తు రుసుము ఎంత? :
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025కి దరఖాస్తు రుసుము రూ.100, అయితే డిసేబుల్డ్ మహిళలు/SC/ST/పర్సన్స్ దరఖాస్తు రుసుముపై మినహాయింపు పొందారు. రుసుమును ఆన్‌లైన్ విధానం ద్వారా చెల్లించాలి. ఈ సంవత్సరం మొత్తం 979 పోస్టులకు నియామక పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు.