Vastu Shastra : వాస్తుశాస్త్రం ప్రకారం.. ఈ 8 వస్తువులను ఎప్పుడూ ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వకూడదు..!
Vastu Shastra : వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం.. ఒక బహుమతి ద్వారా కలిగే నష్టాలను నివారించాలంటే కొన్ని విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

8 Unlucky Gifts to Avoid
Vastu Shastra : మీరు ఎవరికైనా బహుమతి ఇచ్చేందుకు చూస్తున్నారా? అయితే, ఏ బహుమతి ఇవ్వాలా? అని ఆలోచిస్తున్నారా? ఏదైనా ఒక బహుమతి ఇచ్చే ముందు అది మనకు వారి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా భావిస్తారు. మీ బహుమతి ఎంపిక వారి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని మరింత పెంచేలా ఉండాలి.
వాస్తుశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువుల పట్ల అవగాహన తప్పక కలిగి ఉండాలి. అప్పుడే ఆ వస్తువు బహుమతిగా పొందినవారికి అంతా శుభమే జరుగుతుంది. లేదంటే అనుకోని కష్టాలు ఎదురువుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం.. ఒక బహుమతి ద్వారా కలిగే నష్టాలను నివారించాలంటే కొన్ని విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. దురదృష్టాన్ని తీసుకొచ్చే వస్తువులను ఎప్పుడు కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఇది బహుమతి తీసుకున్న వారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వాస్తుప్రకారం.. మీ ప్రియమైనవారికి ఏయే వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. మనీ పర్సులు
సాధారణంగా మనీ పర్సులను డబ్బులు దాచుకునేందుకు వాడుతుంటారు. ప్రతిఒక్కరి వద్ద ఈ మనీ పర్సులు కామన్. అయితే, మీ ప్రియమైన వారికి ఖాళీ పర్సులు లేదా పర్సును బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే.. వారి సంపద, శ్రేయస్సును తగ్గిస్తుంది. ఈ వాస్తుదోషం లేకుండా ఉండాలంటే మీరు ఖాళీ పర్సుతో కాకుండా అందులో కొంత డబ్బును ఉంచి అప్పుడు బహుమతిగా ఇవ్వొచ్చు.
2. రుమాలు (కర్చీఫ్) :
మీకు ఇష్టమైన వారికి రుమాలు లేదా కర్చీఫ్ కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే.. సాధారణంగా చాలామంది కన్నీళ్లు తుడుచుకునేందుకు ఎక్కువగా వాడుతుంటారు. ఇది దు:ఖానికి హేతువుగా చెబుతారు. ఇలాంటి కర్చీఫ్ బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి జీవితంలోకి దురదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
3. గడియారాలు :
వాస్తుశాస్త్రం ప్రకారం.. గడియారాలను కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. గడియారం అనేది కాలాన్ని సూచిస్తుంది. చాలా మంది తరచుగా గడియారాలను బహుమతులుగా ఇస్తారు. గడియారాలను బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ మంచిది కాదు.
ఎందుకంటే ఇచ్చేవారికి ఇద్దరికీ దురదృష్టాన్ని తెస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాలు సమయం ముగింపును లేదా మిగిలిన పరిమిత సమయాన్ని సూచిస్తాయి. వృద్ధులకు గోడ గడియారాలు ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే సమయం గడిచిపోవడాన్ని సూచిస్తాయి.
4. ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్ :
ప్రకృతిలో పెరిగిన పువ్వులకు ప్రత్యేక తేజస్సు ఉంటుంది. కానీ, ఆర్టిఫిషియల్ పూలకు ఎలాంటి తేజస్సు ఉండదు. చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి కానీ, అందులో జీవం ఉండదు. ఇది జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది.
5. తాజ్ మహల్ బొమ్మలు :
తాజ్ మహల్ వంటి బొమ్మలు, వాల్ పేపర్‌లను బహుమతిగా ఇవ్వకూడదు. ఈ తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం అయినా తాజ్ మహల్ అనేది ఒక సమాధి. ఇది మరణం, ఎడబాటును సూచిస్తుంది. సామరస్యపూర్వకమైన ఇంటికి అశుభాన్ని సూచిస్తుంది.
6. పాత వస్తువులు లేదా వాడిన వస్తువులు :
బలమైన సంబంధాలను పెంచుకోవడానికి సానుకూలత, శ్రేయస్సు, అదృష్టాన్ని సూచించే బహుమతులనే ఎంచుకోవాలి. పాత వస్తువులు లేదా ఉపయోగించిన వస్తువులను ఎప్పుడూ కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఇంతకుముందు వాడినవారి జాతక ప్రభావం తీసుకున్నవారిపై పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా కొత్త వస్తువులను ఎవరికైనా బహుమతులుగా ఇవ్వడం ఎంతైనా ఉత్తమం.
Read Also : ఇదెక్కడి బాధ.. చికెన్ తింటే GBS సిండ్రోమ్ వస్తుందని ప్రచారం.. అసలేంటి సిండ్రోమ్? చికెన్ తింటే వస్తుందా?
7. పదునైనా వస్తువులు :
కత్తులు, కత్తెరలు, ఇతర కట్టింగ్ వంటి పదునైనా వస్తువులను ఎప్పుడూ ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే.. ఇలాంటి వస్తువులు సంబంధాలను తెంచేలా ఉంటాయి. విభేదాలు, అపార్థాలకు కారణమవుతాయని నమ్ముతారు.
8. నలుపు రంగు వస్తువులు :
నల్లటి వస్తువులు కూడా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడదు. నలుపు అనేది చెడుకు సూచిన.. దురదృష్టానికి కారణమవుతుంది. అందుకే ఈ నలుపు వస్తువులు చీకటితో ముడిపడి ఉంటాయి. దురదృష్టంతో పాటు నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.