UPSC CSE 2024 Registrations _ Check Last Date, How and Where to Apply
UPSC CSE 2024 Registrations : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 ప్రిలిమినరీ పరీక్షను మే 26న నిర్వహించనుంది. మెయిన్ పరీక్ష అక్టోబర్ 19న జరుగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 5, 2024లోపు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)లో సమర్పించవచ్చు.
యూపీఎస్సీ పరీక్షకు అర్హత పొందే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి లేదా అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సుమారు 1,056 ఖాళీలను భర్తీ చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 40 ఖాళీలు దివ్యాంగ (PwBD) కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేసింది.
సీఎస్ఈ పరీక్ష దరఖాస్తు ఫీజు ఎంతంటే? :
యూపీఎస్సీ అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేయడానికి రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే, మహిళలు, SC, ST, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. యూపీఎస్సీ సీఎస్ఈ 2024 పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఇందులో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్) మెయిన్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ కోసం రాతపూర్వక పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత వివిధ సర్వీసులు, పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
యూపీఎస్సీ సీఎస్ఈ 2024 దరఖాస్తు ఎలా? :
ఓటీఆర్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణ :
దరఖాస్తు ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు సవరణ అనేది 7 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే.. మార్చి 6, 2024 నుంచి మార్చి 12, 2024 వరకు సవరణలు చేసుకోవచ్చు. ఓటీఆర్ ప్రొఫైల్‌లో మార్పులు చేసిన తర్వాత జీవితకాలంలో ఒకసారి చేయవచ్చని గుర్తుంచుకోవాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థి మొదటిసారి ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే.. అధికారిక నోటిఫికేషన్‌లో కమిషన్ పేర్కొన్న విధంగా ఓటీఆర్ సవరణకు గడువు మార్చి 12, 2024 వరకు ఉంటుంది.