UPSC Prelims Rescheduled To June 16 Due To General And Assembly Polls
UPSC Prelims Reschedule : త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ప్రిలిమ్స్) 2024 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. మే 26న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష తేదీని కమిషన్ రీషెడ్యూల్ చేసింది.
అంటే.. ఇప్పుడు జూన్ 16న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్ పరీక్ష :
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇతర సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లకు ఎంపిక చేయడానికి ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2024కి స్క్రీనింగ్ టెస్ట్‌కు ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి మే 26, 2024 నుంచి జూన్ 16 వరకు CS(P)-IFoS(P) పరీక్ష 2024 అధికారిక నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
Read Also : UPSC CSE 2024 : యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్లయ్ చేయాలంటే?