Vacancies in AP High Court :
Vacancies in AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగంలో డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 25, 2023వలోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 4, 2023న నిర్వహిస్తారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్ (పరిపాలన), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/recruitment.html