Vacancies in Central Institute of Petrochemicals Engineering and Technology
CIPET Recruitment : భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీ-పెట్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 సూపర్‌వైజరీ టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి సూపర్‌వైజరీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్) పోస్టుల వివరాలు మేనేజర్ (టెక్నికల్) పోస్టులు: 4, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులు: 6, టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులు: 10, మేనేజర్ (పీ&ఎ) (నాన్-టెక్నికల్) పోస్టులు: 1 ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cipet.gov.in/