CME Pune Recruitment : రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజినీరింగ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ!

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెట్రిక్యులేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

CME Pune Recruitment : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజినీరింగ్‌ (సీఎంఈ)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 అకౌంటెంట్‌, సీనియర్‌ మెకానిక్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎల్‌డీసీ, స్టోర్‌కీపర్‌, కుక్‌, ఫిట్టర్‌, మౌల్డర్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టోర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, లస్కర్‌ తదితర గ్రూప్‌ ‘సీ’ పోస్టుల ను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీలో 27, ఎస్టీ కేటగిరీలో 7, ఓబీసీ కేటగిరీలో 26, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 11, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 48 పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెట్రిక్యులేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్‌, రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ పరీక్షలో ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 4, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cmepune.edu.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు