National Investigation Agency
Vacancies In NIA : కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 సెక్షన్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, అసిస్టెంట్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్1, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400ల వరకు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు 28, 2022 లోపు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ది స్పై (ఆడమ్), ని హెక్ర్స్, కేగి కాంప్లెక్స్, లోడి రోడ్, న్యూ ఢిల్లీ-110003. పూర్తి వివరాలకు https://www.nia.gov.in/ పరిశీలించగలరు.