Vacancy in Indian Army Central Command Headquarters
Vacancy In Indian Army : ఇండియన్ ఆర్మీకి చెందిన లో సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో గ్రూప్ సి కేటగిరి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 96 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బార్బర్, చౌకీదార్, సఫైవాలీ, ట్రేడ్స్ మ్యాన్ మేట్ మొదలగు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షతో పాటు ట్రేడ్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
అర్హతలకు సంబంధించి రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించే ఈఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది సెప్టెంబర్ 16,2022గా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ (BOO-II)మిలిటరీ హాస్పిటల్ రూర్కీ, హరిద్వార్ జిల్లా (ఉత్తరాఖండ్), పిన్ – 247667. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; indianarmy.nic.in పరిశీలించగలరు.