CIPET JOBS : సీపెట్ భోపాల్‌లో లెక్చరర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం నిబంధనల మేరకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000, లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : September 27, 2023 / 11:25 AM IST
CIPET Bhopal Recruitment
CIPET JOBS : సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) భోపాల్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 లెక్చర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Vitamin D3 : విటమిన్ D3 ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? విటమిన్ D3 పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు !
ఖాళీల వివరాలను పరిశీలిస్తే లెక్చరర్(మెకానికల్ ఇంజినీరింగ్): 01, లెక్చరర్ (కెమిస్ట్రీ): 01, లెక్చరర్(మ్యాథ్స్): 01, లెక్చరర్(ప్లాస్టిక్స్/ పాలిమర్): 01, లెక్చరర్(ప్లాస్టిక్స్/ పాలిమర్): 01 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం నిబంధనల మేరకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000, లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !
అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ప్రిన్సిపల్ డైరెక్టర్ & హెడ్,CIPET: CSTS, G-సెక్టార్, గోవింద్‌పురా ఇండస్ట్రియల్ ఏరియా, JK రోడ్, భోపాల్ 462023. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా 07.10.2023 నిర్ణయించారు.
