Vahani Scholarship: ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చదువుకోవాలన్న కోరిక ఉంది ఆర్ధిక ఇబ్బందుల వల్ల చాలా మంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. అలాంటి వారికి ఆర్థికంగా సాహయాన్ని అందించి వారికి సరైన కెరీర్ గైడెన్స్ అందిస్తూ ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తున్న సమస్య వాహని స్కాలర్‌షిప్(Vahani Scholarship) ట్రస్ట్. ఈ సంస్థ విద్యార్థులకు కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా కెరీర్ కౌన్సెలింగ్, మెంటరింగ్, ఇంటర్న్‌షిప్ లాంటి అవకాశాలను కూడా కలిపిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ చదువుకు సంబంధించి మొత్తం ఖర్చులను భరిస్తారు. ఇది పేద విద్యార్థులకు ఈ గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని కోరారు. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ ను నవంబర్ 1లోగా పూర్తి చేయాలి.
అర్హతలు:
- డిగ్రీ/ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
- అభ్యర్థులు 10వ తరగతిలో 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
- విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.3 లక్షలు మించకూడదు.
- మార్కులు, విద్యార్థి వ్యక్తిగత సామర్థ్యం, అకడమిక్ టాలెంట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.vahanischolarship.com లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో ‘అప్లై నౌ’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి
అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
తర్వాత ఆన్‌లైన్ ఫారమ్‌లో అకడమిక్, పర్సనల్ వివరాలను ఎంటర్ చేయాలి
తరువాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
ఉద్యోగ అవకాశాలు:
దాదాపు దశాబ్ద కాలంగా వాహని స్కాలర్‌షిప్ సేవలను అందిస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకున్నారు, అమెజాన్, మైక్రోసాఫ్ట్, EY, డెలాయిట్ లాంటి కంపెనీల్లో జాబ్స్ చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం కొంతమంది విదేశాలకు కూడా వెళ్లారు.