Central Sanskrit University Vacancy
CSU Recruitment : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పలు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో క్యూరేటర్ 1, అసిస్టెంట్1, కాపీయర్ 1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ 5, టెక్నికల్ అసిస్టెంట్ 2, టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబ్) (కంప్యూటర్) 5, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 8, లోయర్ డివిజన్ క్లర్క్ 23, లైబ్రరీ అటెండెంట్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 24 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్, 12వ తరగతి, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 07-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://sanskrit.nic.in/ పరిశీలించగలరు.