Various job vacancies are filled in National Aluminum Company Limited
NALCO Recruitment : ఒడిశా అంగూల్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో సూపరింటెండెంట్ 2 ఖాళీలు, ఆపరేటర్ 15 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మెట్రిక్యులేషన్, ఐటీఐ, బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపేందుకు ఆఖరు తేది సెప్టెంబర్ 28, 2022గా నిర్ణయిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nalcoindia.com/ పరిశీలించగలరు.