Career options in NASA
నాసా (NASA – National Aeronautics and Space Administration) ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది అమెరికాలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు నాసాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే స్థాయిలో సంస్థ కూడా అవకాశాలు అందిస్తోంది. కానీ, అది అంత సులభమైన పని కాదు. ఎంతో కష్టం, సాధించాలన్నా తపన, కఠోర దీక్ష ఉంటే తప్పా నాసాలో అవకాశం దక్కించుకోలేం. ఇప్పటికే భారతదేశం నుంచీ కూడా చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు నాసాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా చాలా మంది అక్కడ పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరి అలాంటి నాసా సంస్థలో చేరాలంటే ఎం చేయాలి? ఎలాంటి నైపుణ్యం, ప్రతిభ ఉండాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాథమిక విద్య, 10th, Inter / 12th లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.
డిగ్రీలో సంబంధిత విభాగంలో బీటెక్ (B.Tech) / బీఎస్సీ (B.Sc) పూర్తి చేయాలి.
పీజీ / పీహెచ్.డి చాలా అవసరం. నాసాలో చాలా ఉద్యోగాలకూ మాస్టర్స్ లేదా డాక్టరేట్ (Ph.D.) అవసరం. ఇది అభ్యర్థి సంశోధన పట్ల మక్కువను చూపిస్తుంది.
ఉన్నత విద్య ద్వారా : అమెరికాలో ఉన్న మంచి యూనివర్శిటీలలో MS / PhD చేయడం ద్వారా నాసాలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. MIT, Stanford, Caltech, University of Michigan లాంటి టాప్ కాలేజీల్లో చదవడం వల్ల నాసా ద్వారా ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్స్ చేసే అవకాశం లభిస్తుంది.
ఇంటర్న్‌షిప్ / ఫెలోషిప్ ద్వారా: NASA జత కలిసే కొన్ని ప్రోగ్రామ్స్ లో ఇంటర్న్ షిప్ చేయడం వల్ల జాబ్ అవకాశం పొందవచ్చు.
నాసా ఉద్యోగ దరఖాస్తు: డైరెక్ట్ గా కూడా నాసాలో కొన్ని ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ, వీటి కోసం US Citizenship అవసరం ఉంటుంది.