Teacher's Day
Teacher’s Day : ఉపాధ్యాయులు ప్రతి వ్యక్తి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతారు. జ్ఞానాన్ని అందించడానికి మించి పౌరుల జీవితంలో క్రియాశీలిక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయులు, గురువులు వ్యక్తుల జీవితాలను తీర్చిదిద్దటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారిచ్చే సూచనలు, సలహాలు, బోధనలు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడానికి , వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
READ ALSO : Eating Corn : కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్న
సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం?
20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితులు , తత్వవేత్తలలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబరు 5, 1888న జన్మించారు. భారతదేశ రెండవ రాష్ట్రపతిగా దేశంలో ఉపాధ్యాయులు ఉత్తమ మనస్తత్వం కలిగి ఉండాలని దృఢంగా విశ్వసించారు. ఆయన అంకితభావానికి గుర్తుగా కొందరు విద్యార్థులు రాధాకృష్ణన్ పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని విద్యార్ధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దానికి ఆయన స్పందిస్తూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ సూచించారు.
దీంతో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.
READ ALSO : kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?
రాధాకృష్ణన్ ఒక గొప్ప ఫిలాసఫర్, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు రాధాకృష్ణన్ చికాగో, మైసూర్, కలకత్తా యూనివర్సిటీలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు విద్యార్థులు ఆకర్షితులయ్యేవారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజు చేయాల్సింది ;
ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. ఎందుకంటే వారి సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఏకైక మార్గం. సెప్టెంబరు 5న మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గురువుకు కృతజ్ఞతలు తెలిపేందుకు గ్రీటింగ్ కార్డ్ రూపంలో అందించటం ఉత్తమమైన, సులభమైన మార్గం. ఉపాధ్యాయులపై ప్రేరణాత్మక లేదా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని విద్యార్ధులు అందించవచ్చు. ఉపాధ్యాయులపై ఇష్టమైన కవితలు,రాయటం వంటివి చేయాలి. ఉపాధ్యాయులను సన్మానించుకోవటం, వారికి బహుమతులు అందించటం చేయటం ద్వారా వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ఉపాధ్యాయులను స్మరించుకోవడం అన్నది విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది.