Bommai says he will return as chief minister in karnataka
Karnataka Polls: కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయడం లేదు. ఎన్నికల అనంతరమే ముఖ్యమంత్రిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అధిష్టానం వైఖరి. అయితే మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానంటూ, బీజేపీ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పష్టం చేశారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఈయన స్థానంలో వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. అలాంటిది, అసెంబ్లీ ముగిసే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని బొమ్మై పేర్కొనడం గమనార్హం.
Uganda: స్వలింగ లైంగిక సంబంధాలు కొనసాగిస్తే మరణశిక్ష.. సంచలన చట్టం చేసిన ఉగాండా
మంగళవారం బగలకోటలో జరిగిన ఓ కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది. నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతాను. ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ చేయడానికి ఆ దేవుడు నాకు మరోసారి అవకాశం కల్పిస్తారు. ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా పని చేశాను. భవిష్యత్తులో ఇలాగే పని చేస్తాను’’ అని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం అందించడానికి తాను చిత్తశుద్ధితో పనిచేశానని, ఫలితంగా వార్షిక తలసరి ఆదాయం గత నాలుగు సంవత్సరాల్లో లక్ష రూపాయలు పెరిగిందని అన్నారు.
12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనియే ఆరాధన’, ‘సామాజిక సమానత్వం’ అనే మార్గంలో తాను నడుస్తున్నానని ముఖ్యమంత్రి బొమ్మై అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, వారి సర్వతోముఖాభివృద్ధికి వివిధ సంఘాలు సహకరించాలని ప్రజలు కోరారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడుస్తున్నామని బొమ్మై చెప్పారు. లింగాయత్ సామాజికి వర్గానికి చెందిన ముఖ్యమంత్రి, బసవేశ్వర పేరును పలుమార్లు ప్రస్తావించారు. బసవేశ్వర అభిమానులు ఉత్తర కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.