Uganda: స్వలింగ లైంగిక సంబంధాలు కొనసాగిస్తే మరణశిక్ష.. సంచలన చట్టం చేసిన ఉగాండా

ఇక ప్రపంచ వ్యాప్తంగా 69దేశాలు హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్నాయి. వీటిలో దాదాపు సగం దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇష్టపూర్వకంగా స్వలింగ సంపర్కం చేసినవారికి మరణ శిక్ష విధించే లేదా అటువంటి అవకాశంగల దేశాలు

Uganda: స్వలింగ లైంగిక సంబంధాలు కొనసాగిస్తే మరణశిక్ష.. సంచలన చట్టం చేసిన ఉగాండా

Uganda clears Anti-Homosexuality bill

Updated On : March 22, 2023 / 4:59 PM IST

Uganda: ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంబంధాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని దేశాలు దీనికి అనుకూలంగా వ్యవహరిస్తుంగా, మరికొన్ని దేశాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. మన దేశంలో సైతం ఇలాంటి వాటిపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉండితే.. ఈ విషయమై ఉంగాడా ప్రభుత్వం (Uganda govt) తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర సంచనాన్ని రేకెత్తిస్తోంది. స్వలింగ లైంగిక సంబంధం కొనసాగిస్తే మరణశిక్ష(Death Penalty) విధంగా మంగళవారం అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఇప్పటికే హోమోసెక్సువాలిటీ చట్టవిరుద్ధం.

Delhi liquor Scam: మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. ఏప్రిల్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ

దీన్నే మరింత బలపరుస్తూ ఉగాండా మంగళవారం పార్లమెంటులో బిల్లు ఆమోదించారు. దీని ప్రకారం గే సెక్స్ చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించవచ్చు. ఈ బిల్లుకు ఉగాండా పార్లమెంటులో పూర్తి స్థాయి మద్దతే లభించింది. కాగా వ్యతిరేకంగా కేవలం ఫాక్స్ ఒడోయి-ఒయివెలోవో మాత్రమే మాట్లాడారు. ఫాక్స్ ఒడోయి-ఒయివెలోవో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం నేరస్థులు జీవిత ఖైదు లేదా మరణ శిక్షను అనుభవించవలసి ఉంటుందన్నారు. ఈ బిల్లు దేశాధ్యక్షుడు ముసేవేని వద్దకు వెళ్తుందని, ముసేవేని దీనిని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చని తెలిపారు.

UK Embassy In Delhi: దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని బ్రిటన్ ఎంబసీ ముందు బారీకేడ్ల తొలగింపు

ముసేవేని పాలన నియంతృత్వంతో కూడుకున్నదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ బిల్లుకు ఉగాండాలో ప్రజా మద్దతు సైతం ఎక్కువగానే ఉంది. ఈ దేశంలో హోమోసెక్సువలిటీ పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది. వలసవాదపాలన కాలంనాటి చట్టాలు హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్నాయి. 1962లో బ్రిటన్(Britain) నుంచి ఉగాండాకు స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఇష్టపూర్వకంగా సేమ్ సెక్స్ యాక్టివిటీలో పాల్గొన్నవారిని దోషులుగా ప్రకటించిన దాఖలాలు లేవు.

Delhi Budget2023: రూ.78,800 కోట్లతో ఢిల్లీ బడ్జెట్.. హైలైట్స్ ఏంటంటే?

ఇక ప్రపంచ వ్యాప్తంగా 69దేశాలు హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్నాయి. వీటిలో దాదాపు సగం దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇష్టపూర్వకంగా స్వలింగ సంపర్కం చేసినవారికి మరణ శిక్ష విధించే లేదా అటువంటి అవకాశంగల దేశాలు ఇరాన్, నార్తర్న్ నైజీరియా, సౌదీ అరేబియా, సోమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్థాన్, బ్రూనై, మౌరిటానియా, పాకిస్థాన్, కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే ఆడ, మగలను చూసినట్టే LGBTQలను చూడాలంటూ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఆసియా దేశాల్లోని ప్రభుత్వాలు ఇందుకు సముఖంగా లేవు. కేవలం వియత్నాం మాత్రమే ఈ విషయంలో ముందడుగు వేసింది.