Skill Development Case: చంద్రబాబు జైలుకు వెళ్లిన కేసు క్లోజ్..

వారిపై వచ్చిన ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవని కోర్టు చెప్పింది. ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పేర్కొంటూ నిందితులపై కోర్టు విచారణను మూసివేసింది.

Skill Development Case: చంద్రబాబు జైలుకు వెళ్లిన కేసు క్లోజ్..

Skill Development Case (Image Credit To Original Source)

Updated On : January 13, 2026 / 11:09 AM IST
  • ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన కేసు
  • విచారణను క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
  • ఆరోపణల్లో వాస్తవాలు లేవన్న న్యాయస్థానం 

Skill Development Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కేసు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు క్లోజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మొత్తం 37 మందిపై విచారణను ఏసీబీ కోర్టు మూసివేసింది. వారిపై వచ్చిన ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవని చెప్పింది. ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పేర్కొంటూ నిందితులపై విచారణను మూసివేసింది

వాదనలు వినాలంటూ నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ కె.అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సీఐడీ తుది నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. 2014-19లో టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే.

Also Read: పండగపూట మందుబాబులకు షాక్‌.. మద్యం బాటిళ్ల ధరలు పెరిగాయ్‌

అప్పట్లో సీమెన్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. రూ.3,356 కోట్ల ప్రాజెక్టు అని అప్పట్లో ప్రకటించారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కేసు నమోదు చేశారు. సీమెన్స్‌ నుంచి నిధులు రాలేదని అప్పట్లో సీఐడీ ఆరోపించింది.

చంద్రబాబు డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించారన్న అభియోగాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టయ్యారు. 53 రోజులు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు ఉన్నారు. దర్యాప్తు పూర్తయిందని ఇటీవల సీఐడీ కోర్టుకు నివేదిక వచ్చింది. నివేదికను పరిశీలించిన కోర్టు కేసును క్లోజ్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు చెప్పింది.