Assam: ఆరేళ్లుగా జమచేసుకున్న రూ.1, రూ.2, రూ.5 కాయిన్స్ తీసుకెళ్లి.. స్కూటీ కొని అంబరాన్నంటే ఆనందం వ్యక్తంచేసిన యువకుడు

కాయిన్స్ తో స్కూటీని కొనుక్కుని సంబరపడిపోయాడు ఆ యువకుడు. షోరూం సిబ్బంది కాయిన్స్ ను లెక్కపెట్టడానికి చాలా సమయం పట్టింది.

Assam: ఆరేళ్లుగా జమచేసుకున్న రూ.1, రూ.2, రూ.5 కాయిన్స్ తీసుకెళ్లి.. స్కూటీ కొని అంబరాన్నంటే ఆనందం వ్యక్తంచేసిన యువకుడు

Assam

Assam: తాతలు, తండ్రులు సంపాదించిన డబ్బుతో కాకుండా సొంతంగా డబ్బు జమచేసుకుని బైక్ కొనుక్కోవాలని అనుకుంటారు కొందరు యువకులు. అయితే, చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి అందుకు కాస్త సమయం పడుతుంది. అసోంలోని గువాహటి, బోరగావ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి తన సొంత డబ్బుతో బైక్ కొనాలన్న కల తాజాగా నెరవేరింది.

మొహమ్మద్ సైదుల్ హక్ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఓ స్కూటీ కొనుక్కోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. చిరు వ్యాపారం కాబట్టి చిల్లర డబ్బులు అధికంగా వచ్చేవి. వాటినే దాచి పెట్టుకుంటూ వస్తున్నాడు. స్కూటీ కొనడానికి కావాల్సిన డబ్బులు జమ అయ్యాయి. దీంతో నిన్న రూ.1, రూ.2, రూ.5, రూ.10 కాయిన్స్ అన్నీ చిన్న డబ్బాల్లో, సంచుల్లో తీసుకెళ్లి ఆ బండి కొనుక్కున్నాడు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్కూటీ కొనాలన్నది తన కల అని, తాను బోరగావ్ లో చిరు వ్యాపారం చేసుకుంటానని మొహమ్మద్ సైదుల్ హక్ చెప్పాడు. దాదాపు ఆరేళ్ల క్రితం నుంచి కాయిన్స్ జమ చేసుకుంటున్నానని, ఇప్పటికి తన కల నెరవేరిందని అన్నాడు.

కస్టమర్ కాయిన్స్ తీసుకుని షోరూంకి రావడంతో తన వద్ద తమ సిబ్బంది వచ్చి ఈ విషయాన్ని చెప్పారని ఆ షోరూం యజమాని మనీశ్ పొద్దార్ తెలిపాడు. గతంలో ఇలాగే కొందరు కాయిన్స్ తీసుకెళ్లి బైకులు కొనుక్కున్న వార్తలను టీవీలు, పేపర్లలో చూశానని అన్నాడు. భవిష్యత్తులో ఫోర్ వీలర్ కూడా కొనాలని మొహమ్మద్ సైదుల్ హక్ కు తాను చెప్పానని తెలిపాడు.

CBI-ED: కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి 8 విపక్ష పార్టీల నిర్ణయం