WhatsApp Group Admins : వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు.. ఇక గ్రూపు అడ్మిన్లదే నిర్ణయం.. అన్ని గ్రూపులను ఒకే చోట చూడొచ్చు..!

WhatsApp Group Admins : రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ గ్రూపు యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందించనుంది. తద్వారా గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు అనేదానిపై అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందిస్తుంది.

WhatsApp Group Admins : వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు.. ఇక గ్రూపు అడ్మిన్లదే నిర్ణయం.. అన్ని గ్రూపులను ఒకే చోట చూడొచ్చు..!

WhatsApp New Features _ WhatsApp launches two new features for groups, here are all the details

WhatsApp Group Admins : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లను రిలీజ్ చేసిన వాట్సాప్.. మరో రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

రాబోయే రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ గ్రూపు యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్ (Group Admins) కు మరింత కంట్రోల్ అందించనుంది. తద్వారా గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు అనేదానిపై అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందిస్తుంది.

అంటే.. ఒక వాట్సాప్ గ్రూపులోని యూజర్.. ఇతర గ్రూపుల్లో కామన్ కాంటాక్టులతో కలిసి ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు. రాబోయే వాట్సాప్ అప్‌డేట్‌తో అడ్మిన్‌లకు వారి గ్రూప్ ప్రైవసీపై మరింత కంట్రోల్ అందించనుంది. అంతేకాదు.. గ్రూపులో ఎవరూ జాయిన్ కావాలో లేదో కూడా నిర్ణయించే అధికారం ఆయా గ్రూపు అడ్మిన్లకు అందిస్తుంది. ఒక అడ్మిన్ తమ గ్రూప్ ఇన్వైట్ లింక్‌ని షేర్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. వారి గ్రూప్‌ను కమ్యూనిటీలో చేరేలా చేయవచ్చు. వాట్సాప్ గ్రూపులోని సభ్యుల చాట్ ఆధారంగా అడ్మిన్‌లు ఎవరు తమ అడ్మిన్లలో జాయిన్ కావొచ్చు లేదా అనేది నిర్ణయించవచ్చు.

Read Also : WhatsApp Tricks : మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఫుల్ మెసేజ్ చదవొచ్చు తెలుసా? పంపినవారికి కూడా తెలియదు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp New Features _ WhatsApp launches two new features for groups, here are all the details

WhatsApp Group Admins : WhatsApp launches two new features for groups

వాట్సాప్‌లో రెండో ఫీచర్ ఇదే :
వాట్సాప్ గ్రూపులో తెలిసిన యూజర్లతో అన్ని గ్రూపులలో ఏది షేర్ చేస్తున్నారో చూడొచ్చు. యూజర్లు తమ గ్రూపులలో ఉమ్మడిగా ఉన్న కాంటాక్టు కోసం సెర్చ్ చేయొచ్చు. ‘కమ్యూనిటీలు, భారీ గ్రూపులలో మీరు ఎవరితోనైనా ఉమ్మడిగా ఉన్న గ్రూపులను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకే చోట అన్ని సంబంధిత గ్రూపులతో కనెక్ట్ కావొచ్చు.

వేర్వేరు గ్రూపుల్లో ఒకే కాంటాక్టును కలిగిన ఎవరితోనైనా షేర్ చేసిన వారి కాంటాక్టును సులభంగా సెర్చ్ చేయొచ్చునని కంపెనీ తెలిపింది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ అడ్మిన్‌ (Whatsapp Admins)లు నిర్వహించే గ్రూప్‌లలో పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. గ్రూప్ చాటింగ్ ఫీచర్‌ను యూజర్లకు అందించడానికి మరిన్ని కొత్త టూల్స్ యాడ్ చేస్తూనే ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.

అంతేకాకుండా, మెసేజింగ్ యాప్ చాలా ఇతర ఫీచర్లపై కూడా పని చేస్తోంది. త్వరలో వినియోగదారులు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలు లేదా వీడియోలను పంపేందుకు అనుమతించనుంది. ఒకేసారి కనీసం 100 ఫొటోలను షేర్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ యాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. మెసేజింగ్ యాప్ యూజర్లకు QR కోడ్‌లను ఉపయోగించి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి, ఈ వాట్సాప్ కొత్త ఫీచర్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియదు.

Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో 29లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!