WhatsApp Accounts Ban : భారత్‌లో 29లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రతి నెలా యూజర్ల భద్రతా నివేదికను రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ నివేదికలో ప్లాట్‌ఫారమ్ గత జనవరిలో నిషేధించిన అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల రిపోర్టులు ఉన్నాయి.

WhatsApp Accounts Ban : భారత్‌లో 29లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

WhatsApp banned over 29 lakh Indian accounts in January 2023, here is why

WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రతి నెలా యూజర్ల భద్రతా నివేదికను రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ నివేదికలో ప్లాట్‌ఫారమ్ గత జనవరిలో నిషేధించిన అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల రిపోర్టులు ఉన్నాయి. జనవరి 2023లో వాట్సాప్‌లో 29 లక్షలకుపైగా భారతీయ అకౌంట్లు నిషేధించినట్టు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఇటీవల యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను షేర్ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(D) ప్రకారం.. వాట్సాప్ ఈ యూజర్ అకౌంట్లను నిషేధించింది. భారతీయ యూజర్లు 2,918,000 అకౌంట్లను వాట్సాప్ నిషేధించిందని లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. జనవరి 1 – జనవరి 31, 2023 మధ్య. దేశంలోని యూజర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత అకౌంట్లను నిషేధించారు.

Read Also : WhatsApp Schedule Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై గ్రూపు కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

భారత చట్టాలు లేదా WhatsApp సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినందుకు వాట్సాప్ ఆయా అకౌంట్లపై చర్యలు తీసుకుంది. 2,918,000 నిషేధించిన అకౌంట్లలో వాట్సాప్ యూజర్ల నుంచి ఏదైనా నివేదికలను స్వీకరించడానికి ముందే 1,038,000 అకౌంట్లను నిషేధించిందని నివేదిక పేర్కొంది. దేశంలో అత్యధిక యూజర్లను కలిగిన వాట్సాప్‌కు 1461 ఫిర్యాదుల నివేదికలు అందాయని డేటా వెల్లడించింది. అందులో 1337 బ్యాన్ అప్పీళ్లు వచ్చాయి కానీ, వాట్సాప్ కేవలం 191 మందిపై మాత్రమే చర్యలు తీసుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌కు 7 భద్రతా సంబంధిత నివేదికలు కూడా అందాయి. అయితే నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

WhatsApp banned over 29 lakh Indian accounts in January 2023, here is why

WhatsApp Accounts Ban : WhatsApp banned over 29 lakh Indian accounts in January 2023

భారత్‌లో లక్షల అకౌంట్లను నిషేధించడంపై వాట్సాప్ స్పందించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసుల్లో అగ్రగామిగా నిలిచిన వాట్సాప్ భద్రతా ఫీచర్‌లు, నియంత్రణలతో పాటు, ఇంజనీర్ల బృందాన్ని, డేటాను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. యూజర్ల కాంటాక్ట్‌లను బ్లాక్ చేసేందుకు యాప్ లోపల నుంచి సమస్యాత్మక కంటెంట్, కాంటాక్టులపై ఫిర్యాదులను నివేదించవచ్చు. యూజర్ ఫీడ్‌బ్యాక్‌పై తప్పుడు సమాచారాన్ని నిరోధించడంలో సైబర్ భద్రతను ప్రోత్సహించడంలో ఎన్నికల సమగ్రతను కాపాడడంలో నిపుణులతో నిమగ్నమై ఉంటారని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ చెప్పింది.

వాట్సాప్‌లో అకౌంట్ ఎలా నివేదించాలంటే? :
వాట్సాప్ నిబంధనలు, షరతులతో పాటు మీ భద్రతను ఉల్లంఘిస్తున్నట్లు భావించే వాట్సాప్‌లోని ఏదైనా అకౌంట్‌పై రిపోర్టు చేయొచ్చు. మీరు మీ రిపోర్టును WhatsApp సెట్టింగ్‌లకు Submit > Help > Contacts Us ఆప్షన్‌పై Tap చేయండి. మీరు ఒకవేళ భారత్‌లోని వాట్సాప్ ఫిర్యాదు అధికారిని సంప్రదించాలంటే.. మీరు మీ ఫిర్యాదును ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. మీ ఎలక్ట్రానిక్ సైన్ చేయవచ్చు. ముఖ్యంగా, కంట్రీ కోడ్‌తో సహా పూర్తి అంతర్జాతీయ ఫార్మాట్‌లో మీ ఫోన్ నంబర్‌ను యాడ్ చేయాలి. ఫిర్యాదులను ఈ కింది అడ్రస్‌కు పోస్ట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

Siddhartha Nahar
Attention: Grievance Officer
WhatsApp, LLC
Unit B8 and B10
The Executive Center
Level 18, DLF Cyber City, Building No. 5, Tower A, Phase III
Gurgaon – 122002
India

Read Also : WhatsApp Tricks : మీ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఫుల్ మెసేజ్ చదవొచ్చు తెలుసా? పంపినవారికి కూడా తెలియదు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!