Congress President Poll: సోనియా, మన్మోహన్ ఢిల్లీలో.. రాహుల్ బళ్లారిలో..

137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గత 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ స్టాండర్డ్ ప్రోటోకాల్ అమలులో ఉటుంది

Congress President Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సోమవారంనాడు జరుగనుంది. ఎన్నికల బరిలో సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా, భారత్ జోడో యాత్రలో ఉన్న సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు వివరణ ఇచ్చింది. కర్ణాటకలోని బళ్లారిలో రాహుల్ ఓటు వేస్తారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌-చార్జి జైరామ్ రమేష్ ఓ ట్వీట్‌లో తెలిపారు.

“రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావులేదు. సంగనకల్లులో భారత్ జోడో యాత్రలో రాహుల్ పాల్గొంటున్నారు. బళ్లారిలోనే రాహుల్, 40 మంది పీసీసీ డెలిగేట్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు” అని జైరామ్ రమేష్ ఆ ట్వీట్‌లో చెప్పారు.

Shashi Tharoor: మల్లికార్జున ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పని చేస్తా: శశి థరూర్

కాగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల్లోనూ మొత్తం 67 బూత్‌లను సిద్ధం చేసినట్టు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ) తెలిపింది.

137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గత 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ స్టాండర్డ్ ప్రోటోకాల్ అమలులో ఉటుంది. పేపర్లపై నెంబరింగ్ ఉండదు. కౌంటర్ ఫాయిల్ ఎన్నికల అథారిటీ జాగ్రత్త చేస్తుంది. బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయడం, సీల్ తీయడం ఎన్నికల ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది.

Congress Reverse Counter to BJP: బీజేపీ ఎడిటింగ్ వీడియోపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

ట్రెండింగ్ వార్తలు