Congress Reverse Counter to BJP: బీజేపీ ఎడిటింగ్ వీడియోపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

బీజేపీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పేరడీ వీడియోలో కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడం, గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం వంటి అంశాలను లేవనెత్తింది. మొదట కాంగ్రెస్‌ను ఏకం చేసుకోవాలని సలహా ఇచ్చింది.

Congress Reverse Counter to BJP: బీజేపీ ఎడిటింగ్ వీడియోపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

'Frustration+Desperation= Animation': Cong on BJP video mocking Rahul

Congress Reverse Counter to BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఆ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’ను ఎద్దేవా చేస్తూ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో మీమ్‭పై కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘ఫ్రస్ట్రేషన్+డిస్పరేషన్=యానిమేషన్’ అంటూ రివర్స్ అటాక్ చేసింది. అంటే నిరాశ, నిస్పృహల వల్ల బీజేపీ నుంచి యానిమేషన్ వచ్చిందంటూ పేర్కొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘వారు పెట్టిన వీడియో చవకబారు ట్రోలింగ్ అని పిలవడం కూడా తక్కువే అవుతుంది. రాహుల్ గాంధీని మాత్రమే కాకుండా సోనియా గాంధీని కూడా అందులో అవమానించారు’’ అని జైరాం రమేశ్ అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ప్రారంభమైన మొదట్లో ఏదో ఒక వివాదంతో తరుచూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ బీజేపీ.. మళ్లీ చాలా కాలం అనంతరం ఏకంగా యాత్రను ఉద్దేశించి యానిమేషన్ వీడియోతో విరుచుకుపడింది.

Medical Education in Hindi: హిందీలో వైద్య విద్య.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా

బీజేపీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పేరడీ వీడియోలో కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడం, గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం వంటి అంశాలను లేవనెత్తింది. మొదట కాంగ్రెస్‌ను ఏకం చేసుకోవాలని సలహా ఇచ్చింది.

ఈ పేరడీ వీడియో చివర్లో సోనియా గాంధీ తన కుమారుడిని ఓదార్చుతున్నట్లు కనిపించింది. రాహుల్ తన తల్లితో ‘‘అమ్మా, గడ్డు కాలం ఎందుకు ముగిసిపోవడం లేదు? ఖతం… టాటా… గుడ్‌బై’’ అని అన్నట్లు ఉంది. ఈ వీడియోను బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఐదు నెలలపాటు 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర జరుగుతోంది.

Andheri East Bypoll: మహారాష్ట్రలో కొత్త రాజకీయం.. ఉద్ధవ్ థాకరేకు షిండే, ఫడ్నవీస్ మద్దతు!