Jagannath Pahadia: దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి.. కవిత్వంపై చిన్న కామెంట్ చేసినందుకు పదవి కోల్పోయారు

పహాడియా ఎంపీగా ఎన్నికైనప్పుడు, అతని వయస్సు 25 సంవత్సరాల రెండు నెలలు. సవాయ్ మాధోపూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. జగన్నాథ్ పహాడియా జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన చాలా ప్రజాదరణ పొందింది.

First Dalit CM: జగన్నాథ్ పహాడియా.. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి. అంతే కాదు, అతి చిన్నవయసులో అంటే 25 ఏళ్లకే లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి. సంజయ్ గాంధీ నామినేట్ చేయడంతో ముఖ్యమంత్రి అయిన ఆయన.. మహాదేవి వర్మ కవిత్వంపై కామెంట్ చేయడంతో కేవలం 13 నెలలకే తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో సంపూర్ణ మధ్యనిషేధం చేసిన ఘనత ఆయనది. దళితుల సమస్యలను లేవనెత్తిన, సంపూర్ణ మద్య నిషేధం విధించి, సీతాపూల్ పురాణాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ తొలి దళిత ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా రాజకీయ జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి ఎలా అయ్యారు?
జూన్ 5, 1980న ఢిల్లీలోని రాజస్థాన్ హౌస్‌లో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం గురించి కొందరు ఎమ్మెల్యేలు రాంకిషోర్ వ్యాస్ పేరు గుసగుసలాడుతుండగా, ‘జగన్నాథ్ పహాడియా ముఖ్యమంత్రి అవుతారు’ అని వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం మరెవరిదో కాదు, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మనవడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ చెప్పగానే మారు మాట లేకుండా నిర్ణయం అయిపోయింది. అనంతరం.. జూన్ 6, 1980న జగన్నాథ్ పహాడియా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.

ఇది కూడా చదవండి: IIT BHU Student Molestation: వెలుగులోకి వచ్చిన దారుణం.. కాశీ ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

మద్యాన్ని నిషేధించిన తొలి ముఖ్యమంత్రి
జగన్నాథ్ పహాడియా పదవీకాలం 13 నెలలు అయినప్పటికీ, ఆ కాలంలోనే ఆయన రాష్ట్రంలో సంపూర్ణ నిషేధాన్ని అమలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం.. మద్యపాన నిషేధం వల్ల కలిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమేమీ భర్తీ చేయదు. అయినప్పటికీ నేను మద్య నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఎందుకంటే మద్యపానం వల్ల పేదలు మాత్రమే చనిపోతారని నాకు తెలుసు. అలాగే మద్యం తాగి మహిళలను కొడుతున్నారు’’ అని అన్నారు. అయితే, జగన్నాథ్ పహాడియా ఆ పదవి నుంచి వైదొలగిన అనంతరం వచ్చిన కొత్త ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ మద్య నిషేధానికి ముగింపు పలికారు.

నెహ్రూని కలవడానికి వెళ్లి ఎన్నికల టిక్కెట్టుతో తిరిగొచ్చారు
జగన్నాథ్ పహాడియా జనవరి 15, 1932న జాట్ సంస్థానం భరత్‌పూర్‌లోని భుసావర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ, ఎంఏ చదివారు. తన విద్యార్థి రోజుల నుంచి రాజకీయాలు, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కార్యకలాపాలలో చురుకుగా ఉండేవారు. నిజానికి, కాంగ్రెస్ సోషలిస్టు వర్గానికి చెందిన నాయకుడు మాస్టర్ ఆదిత్యేంద్ర 1957 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో తమతో ఢిల్లీకి రమ్మని, పండిట్ నెహ్రూని పరిచయం చేస్తామని అడగడంతో మాస్టర్ జీతో కలిసి పహాడియా ఢిల్లీకి వచ్చారు.

ఇది కూడా చదవండి: Teacher Assault : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

25 ఏళ్ల పహాడియాను చూసి నెహ్రూ ప్రశ్నిస్తూ దేశం ఎలా ఉందని అడిగారు. దానికి పహాడియా స్పందిస్తూ.. మంచిదేనని, అయితే దేశంలో దళితులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. అంతే.. మీరు ఎన్నికల్లో పోటీ చేసి దళితుల గొంతుకగా ఎందుకు మారరు? అని పహాడియాను నెహ్రూ ప్రవ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. మీరు నాకు టిక్కెట్ ఇవ్వండి, నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని సమాధానం చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయనకు నిజంగానే లోక్‌సభ ఎన్నికల టిక్కెట్‌ ఇచ్చారు.

నేను ఎంపీనని పహాడియా అంటే నేను నెహ్రూనని టీటీ అన్నారు
వాస్తవానికి, పహాడియా ఎంపీగా ఎన్నికైనప్పుడు, అతని వయస్సు 25 సంవత్సరాల రెండు నెలలు. సవాయ్ మాధోపూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. జగన్నాథ్ పహాడియా జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన చాలా ప్రజాదరణ పొందింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. ట్రైన్‌లో టికెట్ అడిగినప్పుడు, పహాడియా తాను ఎంపీనని చెప్పారు. దీనికి టీటీ స్పందిస్తూ.. ‘నేను కూడా జవహర్ లాల్ నెహ్రూనే’’ అని అన్నారు. అయితే పహాడియా వెంటనే తన కుర్చీ నుంచి లేచి సీటు కింద పెట్టె తీసి, అందులోంచి సర్టిఫికేట్ తీసి టీటీకి చూపించారు. ఇది చూసి టీటీ ముక్కున వేలేసుకున్నారు.

కవిత్వంపై కామెంట్ రాజీనామాకు కారణమైంది
సంజయ్ గాంధీకి పహాడియా సన్నిహితుడిగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు, సీఎం అయిన కొద్ది వారాలకే సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. పహాడియా సీఎంగా ఉన్నప్పుడు జైపూర్‌లో రచయితల సదస్సు నిర్వహించారు. దానికి ఆయనను ఆహ్వానించారు. ఛాయావాద పద్యాలకు ప్రసిద్ధి చెందిన కవయిత్రి మహాదేవి వర్మ కూడా కార్యక్రమానికి వచ్చారు. అయితే తన ప్రసంగంలో మహాదేవి వర్మ కవితల గురించి మాట్లాడుతూ, “మహాదేవి కవితలు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా లేవు. ఆమె ఏమి చెప్పాలనుకుంటున్నాయో నాకు కూడా అర్థం కాలేదు. సామాన్యులకు అర్థమయ్యేలా సాహిత్యం ఉండాలి’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: OBC Quota upto 75%: ఓబీసీ రిజర్వేషన్ 65% పెంపు బిల్లుకు ఆమోదం తెలిపిన బిహార్ అసెంబ్లీ

ఈ విషయంపై అప్పట్లో 73 ఏళ్ల మహాదేవి వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని చాలా అవమానంగా భావించి ఇందిరాగాంధీకి ఫిర్యాదు చేశారు. అలహాబాద్‌కు మహాదేవి వర్మకి ఇందిరా గాంధీతో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఆమెను ఇందిరా అత్త అని పిలిచేవారు. అత్త ఫిర్యాదుతో మేనకోడలు ఇందిర ఆగ్రహం వ్యక్తం చేసి.. సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్నాథ్ పహాడియాను డిమాండ్ చేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామా చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్
జగన్నాథ్ పహాడియా 6 జూన్ 1980 నుంచి 14 జూలై 1981 వరకు అంటే 13 నెలలు మాత్రమే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1957, 1967, 1971, 1980 సంవత్సరాల్లో లోక్‌సభ ఎన్నికల్లో 1980, 1985, 1999, 2003 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేశారు. 1989 నుంచి 1990 వరకు ఒక సంవత్సరం బీహార్, 2009 నుంచి 2014 వరకు హర్యానాకు గవర్నర్‌గా కూడా పహాడియా బాధ్యతలు చేపట్టారు.