AIతో నడిచే డ్రైవర్‌లెస్ కారు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఇక డ్రైవర్ లేకుండానే నడిచే కారు అమెరికాలోనేనా? మన దగ్గర తయారు కాదా? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక శుభవార్త! విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC), కర్ణాటకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కలిసి అద్భుతమైన కారును తయారు చేశారు. దీని పేరు 'విరిన్'.

  • Published By: Mahesh T ,Published On : November 1, 2025 / 12:37 PM IST

టెస్లా, గూగుల్ ఆండ్రాయిడ్ కార్లకు పోటీగా నిలిచే ఈ డ్రైవర్‌లెస్ కారు, భవిష్యత్తులో మన దేశంలోనే స్వయంప్రతిపత్త కార్ల తయారీకి మార్గదర్శకంగా నిలవనుంది. ‘విరిన్’ ప్రాజెక్ట్ కోసం ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు. మన రోడ్లపై ఉండే గుంతలు, అడ్డొచ్చే జంతువులు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు.

AI, మెషిన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి ఈ కారు పనిచేస్తుంది. ఇది డ్రైవర్ అవసరం లేకుండానే ప్రయాణికులతో మాట్లాడి, వారితో కలిసి ముందుకు సాగుతుంది. ‘విరిన్’లోని V2X కమ్యూనికేషన్ 5G టెక్నాలజీ ద్వారా ఇతర వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంభాషిస్తుంది.