విజయాన్ని ముందుగానే ఊహించాం: పర్వేశ్ కూతుర్లు త్రిష, సనిధి

స్పష్టమైన విజయం బీజేపీకి వస్తుందని తాము ముందు నుంచే ధీమాతో ఉన్నామని..

  • Published By: Mahesh T ,Published On : February 8, 2025 / 02:28 PM IST
విజయాన్ని ముందుగానే ఊహించాం: పర్వేశ్ కూతుర్లు త్రిష, సనిధి

Updated On : February 8, 2025 / 2:39 PM IST

న్యూఢిల్లీ ప్రజలు తమకు మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కూతుర్లు త్రిష, సనిధి మీడియాతో అన్నారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని పర్వేశ్ ఓడించిన విషయం తెలిసిందే. ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి మరో ఛాన్స్ ఇవ్వరని, ఈ సారి కచ్చితంగా గెలువనివ్వరని తాము ముందుగానే భావించినట్లు త్రిష, సనిది అన్నారు. స్పష్టమైన విజయం బీజేపీకి వస్తుందని తాము ముందు నుంచే ధీమాతో ఉన్నామని వారు చెప్పారు. బీజేపీలో ముఖ్యమైన నేత, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అలాగే న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి కేజ్రీవాల్ ను 3వేలకు పైగా ఓట్లతో ఓడించారు పర్వేష్ వర్మ.