Blood Pressure: బీపీని ఇలా సింపుల్‌గా తగ్గించుకోవచ్చు తెలుసా?

మన శరీరంలో రక్తం ద్వారా ఆక్సిజన్‌‌తో పాటు పోషకాలు, హార్మోన్లు అన్ని భాగాలకూ అందడానికి బీపీ మోతాదులో ఉండడం అవసరం.

high blood pressure

అధిక రక్తపోటు.. ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో అధికంగా కనబడేది. ఇప్పుడు చిన్న వయసు వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల చాలామంది బీపీ బారిన పడుతున్నారు.

మన శరీరంలో రక్తం ద్వారా ఆక్సిజన్‌‌తో పాటు పోషకాలు, హార్మోన్లు అన్ని భాగాలకూ అందడానికి బీపీ మోతాదులో ఉండడం అవసరం. సాధారణంగా బీపీ 120/80గా ఉండాలి. బీపీని నియంత్రించుకోవడానికి ఈ కింది సూచనలు పాటించండి.

  • రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
  • మీ ఆహారంలో ఉప్పును తగ్గించండి
  • మద్యం పరిమితంగా తీసుకోండి.. వీలైతే పూర్తిగా మానేయండి
  • ధూమపానం మానేయండి
  • రాత్రి సమయంలో 8 గంటలు నిద్రపోవాలి
  • ఒత్తిడిని తగ్గించుకోండి
  • రెగ్యులర్‌గా బీపీ చెకప్‌ చేసుకోండి
  • చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించండి
  • డార్క్ చాక్లెట్లు తినండి (పరిమితంగా)
  • హెల్తీ హై ప్రొటీన్ ఫుడ్స్ తినండి

Diabetes: మధుమేహాన్ని ఇలా సింపుల్‌గా తగ్గించుకోండి..