మధుమేహం ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు. దాన్ని అదుపులో ఉంచుకోవడమే మన ముందు ఉన్న ఏకైక ఆప్షన్. లేదంటే శరీరంలోని అవయవాలకు ముప్పు కొనితెచ్చుకున్నవారు అవుతారు.
మధుమేహాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు. వైద్యులను క్రమం తప్పకుండా కలవాలి. ప్రతి మూడు నెలలకు ఓసారి మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహ స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు ఈ కింది సూచనలు పాటించండి.
డయాబెటిస్‌ను ఇలా నియంత్రించుకోండి..
కార్బోహైడ్రేట్లు తగ్గించండి.. పిండి పదార్థాలు, తీపివస్తువులు తగ్గించాలి
ఏవైనా పానీయాలు తాగితే వాటిలో చక్కెరలేకుండా చూసుకోవాలి