Asthma Home Remedies : చలికాలంలో ఆస్తమా ఎటాక్ నుండి కాపాడుకోవాలంటే.. ఇలా చేయండి

చల్లని వాతావరణం.. దుమ్ము ధూళి.. నూనె పదార్ధాలు వీటిలో ఏదైనా ఆస్తమా ఎటాక్‌కి కారణం కావచ్చు. చలికాలంలో ఆస్తమాతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి కోసం కొన్ని హోం రెమెడీస్ చదవండి.

Asthma Home Remedies : చలికాలంలో ఆస్తమా ఎటాక్ నుండి కాపాడుకోవాలంటే.. ఇలా చేయండి

Asthma Home Remedies

Asthma Home Remedies : ‘ఆస్తమా’ అనేది శ్వాసకోస సమస్య. దీనినే ఉబ్బసం అని కూడా అంటారు. తీవ్రమైన దగ్గు, జలుబు, ఆయాసంతో ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఉన్నవారు మరింత ఇబ్బంది పడతారు. ఆస్తమా ఎటాక్ నుండి రక్షించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఛాతీ బిగుతుగా ఉండటం.. ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం.. ఇదే ఆస్తమా సంకేతం. అధికంగా చేరిన శ్లేష్మం శ్వాస నాళాలలో అడ్డంగా చేరడంతో ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. కొందరిలో దుమ్ము కారణంగా కూడా ఆయాసం మొదలవుతుంది. వాతావరణ కాలుష్యం, లేదా పొగ వల్ల కూడా ఆస్తమా అటాక్‌కి గురవుతారు. ఇది చిన్న సమస్యగా మారి ఒక్కోసారి ఆందోళనకరంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి.

Scooter Condition Tips : చలికాలంలో మీ స్కూటర్ రిపేర్లు రాకుండా సరిగా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పక పాటించండి..!

ఆస్తమాన సహజ చికిత్స ద్వారా కంట్రోల్ చేయవచ్చును. శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం ఎంతో మంచిదట. ప్రతి రోజు యోగా చేయడం, శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ఫిట్ నెస్ మెరుగువుతుంది. ఆస్తమాతో బాధపడేవారు కోకో, కాఫీ, బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ వంటివి తీసుకోవడం చాలా మంచిదట. ఇవి శ్వాసనాళాలు తెరుచుకునేందుకు సహాయపడతాయట.

అల్లం, వెల్లుల్లి ఈ రెండు కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో శ్వాసనాళాలు తెరుచుకునేలా సాయపడతాయట. టీకి అల్లం యాడ్ చేయడం.. వంటల్లో వెల్లుల్లి ఎక్కువగా వాడటం మంచిదట. తేనె గొంతుకు ఉపశమనం ఇస్తుంది. దగ్గుని నివారిస్తుంది. పసుపు బలమైన యాంటీ అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆస్తమాను మరింత తీవ్రతరం చేసే అలెర్జీలను నివారించడంలో సహకరిస్తుంది. ఆస్తమాకు హోమ్ రెమెడీగా రోజువారి ఆహారంలో ఈ రెండు పదార్ధాలను చేర్చుకోవాలి. ఆవిరి పట్టడం వల్ల కూడా పేరుకుపోయిన శ్లేష్మం క్లియర్ అవుతుంది.

Jaggery : చలికాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

ఆస్తమాతో బాధపడుతున్నవారు చల్లని ఆహార పదార్ధాలు తినకూడదు. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం కూడా మంచిది కాదు. రెగ్యులర్‌గా వైద్యులు ఇచ్చిన మందులతో పాటు ఈ హోం రెమెడీస్ పాటిస్తే త్వరగా కోలుకుంటారు. ఆస్తమాకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ, చికిత్స ఎంతో అవసరం. మందులు ఎప్పటివరకు వాడాలి? లేదా ఆపాలి అనేది డాక్టర్ సలహా తీసుకోవాలి.