Sister André Survives COVID : 116ఏళ్ల బామ్మ.. కరోనాను జయించింది. సిస్టర్ ఆండ్రే కరోనాను మహమ్మారిని ఓడించి ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా అవతరించింది. కరోనా నుంచి బయటపడిన మరుసటి రోజునే తన 117వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది బామ్మ.. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన తాను.. కరోనాతో చనిపోతాననే భయపడలేదని అంటోంది ఫ్రెంచ్ బామ్మ.. జనవరి మధ్యలో సిస్టర్ ఆండ్రే కు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. 116ఏళ్ల వయస్సులో కూడా కరోనాతో పోరాడి తన ప్రాణాలను నిలుపుకుంది.
కరోనా నుంచి కోలుకున్న బామ్మ.. వృద్ధ్యాపంలోనూ ప్రాణాంతకమైన వైరస్ తో పోరాటం చేసింది. చివరికి వైరస్ పై విజయం సాధించింది. కరోనాతో పోరాటంలో తాను భయపడలేదని అంటోంది.. కళ్లు కనిపించవు.. వీల్ చైర్ కే పరిమితమైన ఈ బామ్మ.. కరోనాతో పోరాడిన అనుభవాలను పంచుకుంటోంది. ఈమెకు 110 ఏళ్ల వయస్సు ఉన్నాయని ఓ జాబితా వెల్లడించింది. ఈ జాబితాలో ఆమె కంటే పెద్ద వ్యక్తి జపాన్‌కు చెందిన కేన్ తనకా ఉన్నారు.. జనవరి 2న 118 ఏళ్లు నిండినట్లు రాయిటర్స్ తెలిపింది.