Tan Removal: మీ చర్మం టాన్ అయ్యిందా.. ఇక బ్యూటీ పార్లర్ అవసరం లేదు.. జస్ట్ ఇలా చేస్తే చర్మం తెల్లగా మారిపోతుంది

Tan Removal: టాన్ తొలగించడంలో లెమన్, తేనె మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. లెమన్‌లో ఉన్న సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని బ్లీచ్ చేసే లక్షణాలు కలిగి ఉంటుంది.

Tan Removal: మీ చర్మం టాన్ అయ్యిందా.. ఇక బ్యూటీ పార్లర్ అవసరం లేదు.. జస్ట్ ఇలా చేస్తే చర్మం తెల్లగా మారిపోతుంది

Some natural tips needed for tan removal

Updated On : August 15, 2025 / 2:57 PM IST

సూర్య కాంతి అనేది మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిని టాన్ (Sun Tan) ఏర్పడేలా చేస్తుంది. ఇది చర్మాన్ని ముదురు రంగులోకి మారేలా చేస్తుంది. సహజమైన అందాన్ని దెబ్బతీస్తుంది. దీనిని తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కొని చిట్కాలను పాటించడం వల్ల కూడా టాన్ ఆయిన చర్మాన్ని తినగించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.లెమన్, తేనె మిశ్రమం:
టాన్ తొలగించడంలో లెమన్, తేనె మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. లెమన్‌లో ఉన్న సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని బ్లీచ్ చేసే లక్షణాలు కలిగి ఉంటుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కాబట్టి, ఒక టీస్పూన్ తేనెలో అర లెమన్ రసాన్ని కలిపి ముఖానికి లేదా టాన్ ఉన్న చోట అప్లై చేసి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

2.టమాటో రసం:
టమాటో రసం టాన్ ను అద్భుతంగా తొలగిస్తుంది. టమాటోలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది సన్ డ్యామేజ్ ను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కొంచం టమాటో రసం తీసుకుని ముఖానికి లేదా టాన్ ఉన్న చోట అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు తర్వాత కడగాలి. ఇలా వారానికి ఒక రోజూ ఒకసారి చేయవచ్చు.

3.పాలతో, బేసన్ ప్యాక్:
బేసన్ అనేది చర్మానికి స్క్రబ్ లా పనిచేస్తుంది. పాలు చర్మాన్ని మృదువుగా తయారుచేస్తాయి. 2 టీస్పూన్ల బేసన్, 1 టీస్పూన్ పాలు, చిటికెడు పసుపు కలిపి పేస్టుగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి లేదా చేతులపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ కడగాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయడం మంచిది.

4.ఆలివ్ ఆయిల్, షుగర్ స్క్రబ్:
ఆలివ్ ఆయిల్, షుగర్ స్క్రబ్ ఇవి మృత చర్మాన్ని తొలగించడంలో, టాన్ తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ షుగర్‌తో అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. అలా 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం మంచిది.

5.ఆలొవెరా జెల్:
ఆలొవెరాలో చర్మాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయి. ఇది టాన్ తొలగించడంలో సహాయకారిగా పనిచేస్తుంది. తాజా ఆలొవెరా జెల్‌ను టాన్ ఉన్న ప్రదేశంలో రాత్రి పడుకునే ముందు అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.