Terminalia Arjuna Benefits: నిద్ర పట్టడం లేదా.. పడుకునే ముందు ఇది ఒక్క గ్లాస్ తాగండి.. కుంభకరుణుడు పూనినట్టే

Terminalia Arjuna Benefits: అర్జున చెట్టు బెరడు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఇది ఒక ఔషధ రత్నంగా చెప్పుకోవచ్చు.

Terminalia Arjuna Benefits: నిద్ర పట్టడం లేదా.. పడుకునే ముందు ఇది ఒక్క గ్లాస్ తాగండి.. కుంభకరుణుడు పూనినట్టే

Benefits of consuming Arjuna bark daily for the body

Updated On : August 15, 2025 / 6:48 PM IST

ప్రాచీన ఆయుర్వేదంలో అనేక ఔషధ మొక్కలకు ప్రాధాన్యత ఉంది. వాటిలో ముఖ్యమైనది అర్జున చెట్టు (Terminalia arjuna). ఈ చెట్టు బెరడు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఇది ఒక ఔషధ రత్నంగా చెప్పుకోవచ్చు. దీనిని తరుచుగా తీసుకోవడం వల్ల అనేకరకాల రోగాల బారినుండి బయటపడవచ్చు. అలంటి అర్జున బెరడు గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

అర్జున్ బెరడులో ఉండే ముఖ్యమైన గుణాలు:

  • టానిన్లు
  • గ్లైకోసైడ్లు
  • సాపొనిన్లు
  • ఫ్లావనాయిడ్లు

కాల్షియం, మగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని వివిధ వ్యవస్థలకు మేలుగా పనిచేస్తాయి.

1.గుండె ఆరోగ్యానికి అద్భుత ఔషధం:
అర్జున బెరడు హార్ట్ టానిక్గా ప్రసిద్ధి చెందింది. ఇది గుండెపోటు (heart attack), హార్ట్ ఫెయిల్యూర్, హై బీపీ లాంటి సమస్యల నివారణకు సహాయపడుతుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ధ్వనిని సరిగ్గా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

2.రక్తపోటు నియంత్రణ:
అర్జున బెరడులో సహజంగా బీపీని తక్కువ చేసే గుణం ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లావనాయిడ్లు శిరోజాలపై (blood vessels)మంచి ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది.

3.కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయకారి:
అర్జున బెరడు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4.శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం:
అర్జున్ బెరడు దుమ్ము, దగ్గు, ఆస్థమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. శ్వాసనాళాల్లో వాపును తగ్గించి శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

5.చెడు కొవ్వు కరుగుదల:
ఈ బెరడు లిపిడ్ మెటబాలిజాన్ని మెరుగుపరచడం ద్వారా శరీరంలోకి చేరే చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవచ్చు.

6.మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది:
అర్జున్ బెరడు నీరు తాగినప్పుడు నరాలపై శాంతి ప్రభావం చూపుతుంది. దీని వల్ల స్ట్రెస్, టెన్షన్, మానసిక ఆందోళన తగ్గుతాయి.

వాడే విధానం:
అర్జున బెరడు కషాయం / టీ కోసం 1 టీ స్పూన్ అర్జున బెరడు పొడిని 1.5 గ్లాసుల నీటిలో వేసి సగానికి మరిగేవరకు వేడి చేయాలి. వడగట్టి, వేడిగా తాగాలి.

ఇలా రోజుకు 1 నుంచి 2 సార్లు తాగవచ్చు. డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది.

జాగ్రత్తలు:

  • గర్భిణీలు, పిల్లలు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
  • బీపీ, గుండె మందులు వాడుతున్నవారు దూరంగా ఉండాలి
  • ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.