Colon Cleansing: పేగుల్లో మలం.. కోలన్ క్లీనింగ్ తో మాయం.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?
కోలన్ అనేది మన పెద్ద పేగులో ఒక భాగం. ఇది అహారాన్ని చేసి చివరికి మలంగా(Colon Cleansing) మారే ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

Colon Cleansing: కోలన్ అనేది మన పెద్ద పేగులో ఒక భాగం. ఇది అహారాన్ని చేసి చివరికి మలంగా మారే ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే, మలం బయటకు వచ్చే క్రమంలో లోపల పెద్ద ఎత్తున మలం పేరుకుపోయి ఉంటుంది. అలా మలం ప్రేగుల లోపల(Colon Cleansing) పేరుకోవడం వల్ల మలబద్దకం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కోలన్ అనేది శుభ్రంగా ఉండటం చాలా అవసరం. మరి ఆ కోలన్ అనేది క్లీన్ గా ఎలా ఉంచుకోవాలి అనేది దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: గుండె బాగుండాలంటే నాన్ వెజ్ తినాల్సిందే.. లేదంటే ఏమవుతుందో తెలుసా?
కోలన్ క్లీనింగ్ అంటే ఏమిటి?
కోలన్ క్లీనింగ్ అంటే పేగులలో చేరిపోయిన మలాన్ని, టాక్సిన్స్‌ను, అవాంఛనీయ పదార్థాలను బయటకు తీసివేయడమే. ఇది సహజంగా లేదా వైద్యపరంగా చేసే ఒక ప్రక్రియ. కోలన్ క్లీన్ చేయడం వల్ల శరీరం హెల్తీగా మారుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగా పనిచేస్తుంది, ఒత్తిడి, అలసట తగ్గుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
కోలన్ క్లీనింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
1.అజీర్తి, గ్యాస్ సమస్యల నివారణ:
కోలన్‌లో నిల్వ అయ్యే వ్యర్థాలు అజీర్తి సమస్యను కలుగజేస్తాయి. ఇవి తొలగిపోతే, అజీర్తి, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడం ప్రారంభమవుతుంది. తద్వారా శరీరానికి శక్తి అందుతుంది.
2.శరీర డిటాక్సిఫికేషన్:
కోలన్‌లో కొన్నిసార్లు టాక్సిన్స్, మలాల, బ్యాక్టీరియా నిల్వ అయ్యి శరీరానికి హానికరం చేస్తాయి. కోలన్ క్లీనింగ్ ద్వారా ఇవి శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం తేలిగ్గా, ఫ్రెష్‌గా మారుతుంది.
3.బరువు తగ్గవచ్చు:
శరీరంలో మలజలం ఎక్కువగా ఉన్నపుడు ఒత్తిడి, బ్లోటింగ్, తేలికపాటి బరువు పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. కోలన్ శుభ్రం చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే 1 నుంచి 2 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. ఇది ఫిట్‌నెస్ ప్రయాణంలో మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు.
4.మానసిక ఉల్లాసం:
శరీరంలో వ్యర్థాలు ఉన్నపుడు అలసట ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒత్తిడి పెరుగుతుంది. వాటిని తొలగించితే శరీరానికి కావాల్సిన శక్తి పూర్తిగా అందుతుంది. నిద్ర బాగా పడుతుంది, మూడ్ హాయిగా మారుతుంది. ఫోకస్ మెరుగవుతుంది.
5.చర్మ ఆరోగ్యం:
కోలన్ మలంతో నిండిపోయినపుడు చర్మంపై మొటిమలు, మచ్చలు ఏర్పడవచ్చు. పేగులు శుభ్రంగా ఉన్నపుడు రక్తం శుద్ధి అయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన స్కిన్ గ్లో కనిపిస్తుంది.
కోలన్ క్లీనింగ్ చేసే సహజ (నేచురల్) మార్గాలు:
- ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
- ఆకుకూరలు, మునగ ఆకులు, బీట్‌రూట్, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా తినాలి
- గోధుమ రవ్వ, అవిసె కురగాయలు తినాలి
- ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలి
- ప్రాణాయామం, యోగా లాంటివి చేయాలి.