5 Myths Sugar : షుగర్ నేరుగా తీసుకుంటే డయాబెటిస్ వస్తుందా? ఈ 5 అపోహలను అసలు నమ్మొద్దు..!

5 Myths Sugar : షుగర్ విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉంటాయి. షుగర్ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, ముఖ్యంగా డయాబెటిస్ వస్తుందని నమ్ముతారు. ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు మీకోసం..

5 Myths About Sugar Consume You Shouldn't Believe

5 Myths Sugar : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెర అనగానే భయపడిపోతుంటారు. కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. కొంతమంది అయితే, చక్కెర అధికంగా తీసుకోవడం వల్లే డయాబెటిస్ వస్తుందని బాగా నమ్ముతుంటారు. షుగర్‌ను ఒక శత్రువులా చూస్తుంటారు. అది బరువు పెరగడానికి షుగర్ కారణమని భావిస్తుంటారు. వాస్తవానికి చక్కెర విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. వీటి కారణంగానే చాలా మంది తమకు ఇష్టమైన తీపి పదార్థాలను తినకుండా చేస్తాయి. చక్కెర గురించి అపోహల్లో వ్యసనపరులుగా చేస్తుందని నమ్ముతారు.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

అయితే, చక్కెర వ్యసనానికి దారితీస్తుందని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొంతమందికి, ఏదైనా తీపి తినడం వల్ల డోపమైన్ పెరుగుతుంది. అది వ్యసనం మాదిరిగా ఉండదు. కొందరు చక్కెర తినాలని కోరిక కలిగించవచ్చు. ఇతర ఆహారాల కన్నా చక్కెరను ఎక్కువగా తినవచ్చు. చక్కర మాత్రమే కాదు.. ఏ పదార్థామైన మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అనేది తెలుసుకోవాలి. చక్కెర గురించి అనేక అపోహల్లో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెరతో డయాబెటిస్ వస్తుంది :
చక్కెరను నేరుగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా మధుమేహాన్ని షుగర్ అని కూడా అంటారు. అయినప్పటికీ, కుటుంబ చరిత్ర, జన్యువులు, వయస్సు, శరీర బరువు, పీసీఓఎస్, శారీరక శ్రమ స్థాయిలు టైప్-2 మధుమేహానికి ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. కేవలం షుగర్ తింటే డయాబెటిస్ వస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. డయాబెటిస్ వచ్చిన వాళ్లు షుగర్ తీసుకుంటే లెవల్స్ మరింత పెరుగుతాయని వద్దని సూచిస్తుంటారు.

జీరో షుగర్ డైట్ తీసుకోవాలి :
చక్కెర అసలు తీసుకోకూడదు. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యంగా తినడానికి చాలామంది తరచుగా చెప్పేమాట.. ఆహారంలో అసలు చక్కెరను తీసుకోరు. నిజం ఏమిటంటే.. చక్కెరను అధికంగా తీసుకోవడం హానికరమే.. సరైన మోతాదులో తీసుకోనప్పుడే ఆరోగ్యానికి చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. చక్కెర, తీపి పానీయాల వంటి అనారోగ్యకరమైన మూలాల నుంచి వినియోగాన్ని నివారించండి.

కృత్రిమ స్వీటెనర్లు తినవచ్చు :
మార్కెట్లో ఎక్కడ చూసినా కృత్రిమంగా తయారు చేసిన తీపి పదార్థాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి షుగర్ కంటెంట్ ఆహారాలు, పానీయాలతో మార్కెట్ సాధారణ ఉత్పత్తుల కన్నా ఆరోగ్యకరమైనవి అని నమ్ముతారు. పరిశోధన ప్రకారం.. కృత్రిమ స్వీటెనర్లు అత్యంత ఇష్టంగా తింటారు. కృత్రిమంగా తయారు చేసిన స్వీటెనర్‌లను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.. మోతాదుకు మించి తీసుకునే వారిలో మధుమేహం, క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

షుగర్ వల్ల కావిటీస్ వస్తాయి :
చక్కెర లేదా ఇతర ఏ తీపి పానీయాలు ఎక్కువగా తీసుకున్నా కావిటీస్ ఏర్పడతాయి. కానీ చక్కెర మాత్రమే అందుకు కారణం కాదని గుర్తించాలి. చక్కెరను మితంగా తీసుకోవచ్చు. కృత్రిమంగా తయారైన చక్కెర కన్నా సహజ చక్కెరను తీసుకోవడం ఎల్లప్పుడు ఆరోగ్యానికి మంచిదని గమనించాలి.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!