సమ్మర్ సమీపిస్తున్నకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేడి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సరైన ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ముఖ్యం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో చియా గింజలు ఒకటని మీకు తెలుసా?
బరువు తగ్గాలనుకునేవారు, అలాగే అనేక వ్యాధుల నుండి రక్షణ పొందాలనుకునేవారు తమ రోజువారీ ఆహారంలో చియా విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకుంటారు. నలుపు-బూడిద రంగులో చిన్నగా కనిపించే ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. (చదవండి: మీ మూత్రం రంగును బట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో ఇలా చెప్పవచ్చు…)
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన చియా గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో, ఆరోగ్య నిపుణులు వీటిని ఒక అద్భుతమైన ఆహారంగా సూచిస్తున్నారు. ప్రత్యేకంగా, చియా సీడ్స్ ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
1) చియా సీడ్స్ నీటిని పీల్చుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో శరీరాన్ని చల్లగా ఉంచి, డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి.
2) దీనిలో ఫైబర్ పోషకాలు మెండుగా ఉండటంతో కడుపు త్వరగా నిండిన భావన కలిగించి ఎక్కువ తినకుండా నిరోధిస్తాయి. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
3) సులభంగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకాన్ని తగ్గించడంలో చియా సీడ్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి.
4) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ – ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మెండుగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గి హార్ట్ ప్రాబ్లమ్స్ నివారించడంలో సహాయపడతాయి.
5) ఇందులో ప్రొటీన్, కొవ్వు పదార్థాలు ఉండటంతో శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి.
6) డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే రక్తంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి
7) చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉండటంతో ఎముకల బలం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
8) వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వలన వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
9) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని కాపాడి మెమొరీ శక్తిని పెంచుతాయి.
ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని, దాని వల్ల ఎటువంటి సమస్య ఉండదని. విత్తనాలను నేరుగా తీసుకోవడం కంటే వాటర్ లో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.