మీ మూత్రం రంగును బట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో ఇలా చెప్పవచ్చు…
కిడ్నీస్టోన్స్ ఉన్నట్లు ఎలా గుర్తించాలి..? లక్షణాలు ఏంటి..?

ఉప్పు, కాల్షియం లేదా యూరిక్ యాసిడ్‌తో మూత్రపిండాల లోపల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. కొన్ని కిడ్నీ స్టోన్స్ చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. రోజుకి తగినంత నీరు తీసుకోకపోవడం, కొన్ని జంక్ ఫుడ్స్ తినడం, వ్యాయామం లేకపోవడం, మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉండడం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా మనకు కిడ్నీస్టోన్స్ ఉన్నట్లు గుర్తించవచ్చు. వాటిని ముందుగానే గుర్తించడం వల్ల సరైన ట్రీట్మెంట్ కు సహాయపడుతుంది.
- తీవ్రమైన నొప్పి: పక్కటెముకల దగ్గర వీపు కింద నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్ ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు, కడుపు, నడుము ప్రాంతాల్లో నొప్పి వస్తుంది. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది.
- మూత్రంలో మంట: మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఎక్కువగా అనిపిస్తే దాన్ని కిడ్నీ స్టోన్ కి సంకేతంగా భావించవచ్చు. మూత్రాశయం మధ్యలోకి రాయి చేరితే ఇలా అనిపిస్తుంది.
- మూత్రం పోవడంలో ఇబ్బంది: ఒక్కోసారి మూత్రం వచ్చి, రానట్లుగా.. ఒక్కో బొట్టు పడుతున్నట్లు ఉండి నొప్పిగా ఉంటుంది. ఇలా జరిగితే రాయి మూత్రనాళంలో దిగువకు వెళ్లిందని అర్థం చేసుకోవాలి.
- వికారం మరియు వాంతులు: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి అవి కదులుతున్నప్పుడు కడుపు నొప్పి, వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంది.
- మూత్రం రంగులో మార్పు: మూత్రంలో రాళ్లు వచ్చినప్పుడు రక్తం ఎరుపు/గులాబీ /గోధుమ రంగుల్లో ఉంటుంది.
అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కిడ్నీలో ఉన్న రాళ్లను గుర్తించవచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును కలవాలి.
Disclaimer: మేము ఇందులో ఉన్న విషయాలను ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి మాత్రమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము. ఏమైనా అనుమానాలు ఉంటే మంచి డాక్టర్ ని సంప్రదించండి