ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే… లాక్‌డౌన్‌లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి కాస్త రూటు మార్చిందట..
ఇప్పటివరకు లక్షణాలు కనిపిస్తూ.. వ్యాధిని పసిగట్టే అవకాశం ఇచ్చిన కరోనా వైరస్.. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కూడా నెమ్మదిగా మనిషిలోకి ప్రవేశించి విస్తరిస్తుంది. నిశ్శబ్ధంగా మనుషుల్లోకి ప్రవేశిస్తూ.. అందరికీ వ్యాపిస్తుంది. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది ఒక కారణం అవుతోంది. ఎనభై శాతానికి పైగా కరోనా వ్యాధిగ్రస్తులకు అసలు వైరస్ లక్షణాలే కనిపించట్లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) వెల్లడించిన సంచలన విషయం ఇప్పుడు నిద్ర పట్టనివ్వట్లేదు.
భారత్‌లో ఇది 69 శాతంగా ఉందని, కరోనా సోకిన పది మందిలో ఏడుగురికి ఏమాత్రం వ్యాధి లక్షణాలు కనిపించట్లేదని చెప్తున్నారురు. వీరిని క్వారంటైన్‌లో ఉంచకపోతే వారికి తెలియకుండానే ఇతరులకు వ్యాధిని అంటించే ప్రమాదం ఉందని అంటున్నారు.
దేశంలో 19 వేలకు పైగా కోవిడ్-19 బాధితులు ఉండగా ఇందులో 13 వేలమందికి కరోనా లక్షణాలే కనిపించలేదని ఐసీఎమ్ఆర్ చెప్పింది. అలాగే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 15శాతం రోగులు కొద్దిగా అస్వస్థతకు లోనవుతుండగా 5శాతం రోగుల పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు.