Brain Stroke
Brain Stroke : ప్రస్తుత బిజీ లైఫ్ లో ఉద్యోగరిత్యా చాలా మందికి ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైనది. దీనికి తోడు జీవనశైలి మార్పులతో శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. ఫలితంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. బ్రెయిన్ స్టోక్ భారిన పడుతూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బ్రెయిన్ స్టోక్ రావడానికి ప్రధానంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధూమపానం అలవాటు అధికంగా ఉన్నవారు స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి పలు కారణాలతో అనేక మంది బ్రెయిన్ స్టోక్ భారిన పడుతుంటారు. తాజాగా వెల్లడయిన అధ్యయనంలో బ్రెయిన్ స్టోక్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తేలింది.
Also Read : అయ్యయ్యో.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నదికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) ఈ సమగ్ర అధ్యయనానికి నేతృత్వం వహించింది. ఇందులో గుర్తించిన అంశాల ప్రకారం.. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారి సంఖ్య 2021లో 1.19 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 1990తో పోలిస్తే ఇది 70శాతం అధికం. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 1990తో పోలిస్తే 44శాతం పెరిగింది. 2021లో 73లక్షలుగా మృతుల సంఖ్య నమోదైంది. ఈ మరణాలపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం 1990తో పోలిస్తే 72శాతం పెరగడం గమనార్హం.
Also Read : Canada: కెనడాలో భారతీయ విద్యార్థులకు డేంజర్ బెల్స్.. ప్రధాని ట్రూడో కీలక ప్రకటన
అధిక ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం వంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు కారణమవుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు, శారీరక జడత్వం వంటివి కూడా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధిత మరణాల పెరుగుదలకు దారితీస్తున్నాయని తెలిపింది. ధూమపానం, ఊబకాయం, శారీరక జడత్వం, అధిక రక్తపోటు వంటివికూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి, సంబంధిత మరణాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని తన అధ్యయనంలో ఐహెచ్ఎంఈ పేర్కొంది. సూక్ష్మధూళి కణాల కాలుష్యం ధూమపానం స్థాయిలో మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.