Canada: కెనడాలో భారతీయ విద్యార్థులకు డేంజర్‌ బెల్స్‌.. ప్రధాని ట్రూడో కీలక ప్రకటన

ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడియన్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థులు ప్రయోజనాన్ని పొందినట్లయితే..

Canada: కెనడాలో భారతీయ విద్యార్థులకు డేంజర్‌ బెల్స్‌.. ప్రధాని ట్రూడో కీలక ప్రకటన

Canada PM Justin Trudeau

Updated On : September 19, 2024 / 8:55 AM IST

Canada : కెనడా వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అప్పట్లో కెనడా ఆహ్వానాన్ని అందిరిలాగే భారతీయులు అందిపుచ్చుకున్నారు. భారీగా కెనడాకు వెళ్లారు. ముఖ్యంగా ఉన్నత విద్యకోసం ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రపంచంలోనే టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో కొన్ని కెనడాలోకూడా ఉన్నాయి. అమెరికా వెళ్లాలనుకున్న వారు వీసా దక్కని పరిస్థితుల్లో ముందు కెనడాకు వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లడం సులువు అవుతుందని కెనడాను ఎంచుకుంటున్నారు. దీనికితోడు విద్య, ఉపాధి అవకాశాలకోసం కెనడా వెళ్లి స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, ఈ వలసలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడం, కొన్ని చోట్ల కెనడియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీయులు ఉండటం వంటివి సమస్యలు తలెత్తాయి. వలసల వల్ల కెనడియన్లు వెనకబడిపోతున్నారని, ఉద్యోగాల్లోనూ వలస వచ్చిన విదేశీయులకే ప్రాధాన్యత లభిస్తోందని ఆ దేశస్తులు ఆందోళనలకు దిగుతున్నారు.

Also Read : లెబనాన్‌లో వాకీటాకీ పేలుళ్లు.. 32కి చేరిన మృతుల సంఖ్య.. పలువురి పరిస్థితి విషమం

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గత కొన్ని నెలల క్రితం నిర్వహించిన సర్వేలో ప్రధాని టూడ్రో ప్రభుత్వంపై ఆ దేశ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని తేలింది. దీనికి కారణం విదేశీల సంఖ్య దేశంలో పెరిగిపోవటం, వారికే ప్రాధాన్యత లభిస్తుండటం. దీంతో ట్రూడో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కెనడా వలసలపై ఆంక్షలు విధించింది. విదేశీ విద్యకోసం విద్యార్థులకు వీసా ఫీజులను పెంచింది. అంతేకాదు.. వారి బ్యాంకు ఖతాల్లో కనీసం ఉండాల్సిన నగదును భారీగా పెంచింది. అలాగే వలసలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చింది. కెనడాలో ఎక్కువగా ఉంటున్న విదేశీయుల్లో అత్యధికం భారతీయులే. దీనికితోడు అక్కడ విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీయుల్లో భారత విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ దేశంలో శాశ్వత పౌరసత్వం లభించని వారు తమ వీసా గడువు ముగిసిన తరువాత కెనడాను వీడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read : Russia Birth Rate : వర్క్ బ్రేక్ తీసుకోండి.. పిల్లల్ని కనేందుకు ప్రయత్నించండి.. దేశ జనన రేటు పెంచాలంటూ రష్యా వింత వినతి..!

తాజాగా ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడియన్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థులు ప్రయోజనాన్ని పొందినట్లయితే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో విదేశీ కార్మికులకోసం నిబంధనలను కూడా కఠినతరం చేస్తామని బుధవారం టూడో ప్రభుత్వం పేర్కొంది.
ప్రధాని జస్టిస్ ట్రూడో ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం ఈ సంవత్సరం 35శాతం తక్కువ అంతర్జాతీయ విద్యార్థుల అనుమతులను మంజూరు చేస్తుందని, 2025 నాటికి ఈ సంఖ్యను అదనంగా 10శాతం తగ్గించనున్నట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ మా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రయోజనం.. కానీ, ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థులు ప్రయోజనాన్ని పొందినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని ట్రూడో తెలిపారు.