Russia Birth Rate : వర్క్ బ్రేక్ తీసుకోండి.. పిల్లల్ని కనేందుకు ప్రయత్నించండి.. దేశ జనన రేటు పెంచాలంటూ రష్యా వింత వినతి..!

Russia Birth Rate : రష్యాలో జననాల రేటు భారీగా క్షీణించింది. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వింత నిర్ణయాన్ని తీసుకున్నారు.

Russia Birth Rate : వర్క్ బ్రేక్ తీసుకోండి.. పిల్లల్ని కనేందుకు ప్రయత్నించండి.. దేశ జనన రేటు పెంచాలంటూ రష్యా వింత వినతి..!

Putin Urges Russians to make babies during work breaks as country battles falling birth rate

Updated On : September 18, 2024 / 9:28 PM IST

Russia Birth Rate : రష్యాలో రోజురోజుకీ జననాల రేటు భారీగా తగ్గిపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రష్యా జనాభా పరంగా తీవ్ర క్షీణతను ఎదుర్కోనే ప్రమాదం ఉంది. ఒకప్పటిలా రష్యా ప్రజలు చేసే పనులపైనా తప్పా పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తిగా చూపడం లేదట.. దాంతో జననాల రేటు భారీగా క్షీణించింది. రష్యాలో ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వింత నిర్ణయాన్ని తీసుకున్నారు.

జననాల రేటును పెంచడమే లక్ష్యంగా రష్యా ప్రభుత్వం ఈ వింత విజ్ఞప్తి చేసింది. అదేంటంటే.. ఆ దేశ ప్రజలను పనిపై ఎక్కువ సమయం కేటాయించకుండా పిల్లల్ని కనడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరింది అందుకే.. వర్క్‌లో కాస్తా కాఫీ, టీ బ్రేక్ ఇవ్వాలని సూచిస్తోంది.. ఆ విరామ సమయంలో పిల్లల్ని కనేందుకు ప్రయత్నించాలని పుతిన్ సూచించారు. రష్యాలో పడిపోతున్న జననాల రేటును పెంచేందుకు దేశ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Read Also : Asteroid FW13 : పురాతన భారీ గ్రహశకలం గంటకు 35వేల మైళ్ల వేగంతో భూమి వైపుగా దూసుకెళ్తోంది.. నాసా హెచ్చరిక..!

రష్యా భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది :
రష్యన్లు తమ పని విరామ సమయంలో పిల్లల్ని కనాలని పుతిన్ ప్రోత్సహించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలో సంతానోత్పత్తి రేటును పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 రేటు కన్నా తక్కువగా పడిపోయింది. దాంతో ఒక్కో మహిళకు దాదాపు 1.5 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. రష్యన్ ప్రజల పరిరక్షణ మా అత్యధిక జాతీయ ప్రాధాన్యత’ అని పుతిన్ పేర్కొన్నారు. ‘రష్యా భవిష్యత్తు.. మనలో ఎంతమంది జనాభా ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రశ్న’ అని రష్యా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

విరామ సమయంలో పిల్లల కోసం వెచ్చించండి :
రష్యా జనాభా రోజురోజుకీగా మరింత క్షీణతను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది యువకుల వలసలు వెళ్తున్నారు. జనాభా క్షీణతను తిప్పికొట్టడం జాతీయ ప్రాధాన్యతగా పుతిన్ స్పష్టం చేశారు. ఎంత మంది ప్రజలు మిగిలి ఉన్నారనే దానిపై దేశభవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రకటించారు.

రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ కొత్త విధానానికి మద్దతు ఇస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడానికి బిజీ వర్క్ షెడ్యూల్‌ అనేది ఆయన తోసిపుచ్చారు. “విరామ సమయంలో మీరు పిల్లలను కనవచ్చు” అని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేసేవారు పిల్లల్ని ఎలా కనగలరని ప్రశ్నించినప్పుడు.. ఆయన కేవలం “విరామ సమయాలలో” అది సాధ్యమేనని సమాధానమిచ్చారని నివేదిక పేర్కొంది.

దేశ జనన రేటు పెంచడమే లక్ష్యం :
ఈ కొత్త విధానంతో దేశ జనన రేటును పెంచాలని రష్యా భావిస్తోంది. మాస్కోలోని మహిళలకు ఇప్పుడు వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఉచిత సంతానోత్పత్తి పరీక్షలను అందిస్తారు. అంతేకాదు… ప్రతి ఏడాదిలో జననాల సంఖ్యను పెంచే లక్ష్యంతో కంపెనీల యజమానులు తమ ఉద్యోగుల జనన రేటును ట్రాక్ చేసి నివేదించాలని ఎంపీ తత్యానా బుట్స్​కయా ప్రతిపాదించారు. చెల్యాబిన్స్క్ ప్రాంతంలో, యువతులకు వారి మొదటి బిడ్డ పుట్టినప్పుడు ప్రోత్సాహకంగా £8,500 అందిస్తున్నారు.

దేశ ప్రభుత్వం గర్భస్రావానికి యాక్సెసబిలిటీని కూడా పరిమితం చేస్తోంది. దేశ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రముఖులు, మత పెద్దలు సైతం సంతానోత్పత్తి, పెంపకంలో మహిళల పాత్రను సమర్థిస్తున్నారు. అధిక జనన రేటు కోసం గర్భస్రావాలు, విడాకుల రుసుములను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నా కుజ్నెత్సోవా, ఝన్నా ర్యాబ్ట్సేవా వంటి రాజకీయ నాయకులు మహిళలు చిన్న వయస్సులోనే పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సంతానం పెద్ద కుటుంబాలకు దారితీస్తుందని సూచిస్తున్నారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా :
రష్యా సైన్యాన్ని ప్రపంచంలో 2వ అతిపెద్దదిగా విస్తరించేందుకు అధ్యక్షుడు పుతిన్ కూడా రష్యా సైన్యాన్ని పెద్ద ఎత్తున విస్తరించాలని ఆదేశించారు. లక్ష 80వేల మంది సైనికుల సంఖ్యను పెంచాలని, 1.5 మిలియన్ల మంది చురుకైన సిబ్బందితో మొత్తం బలగాలను 2.38 మిలియన్లకు పెంచాలని కోరింది.

చైనా తర్వాత రష్యా సైన్యాన్ని ప్రపంచంలో రెండో అతిపెద్దదిగా విస్తరించాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ విస్తరణతో 2022లో ఉక్రెయిన్ దండయాత్ర ప్రారంభం నుంచి సైనిక సిబ్బందిలో మునుపటి పెరుగుదలను సూచిస్తోంది. సంఘర్షణ, భారీ నష్టాలతో, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా జాతీయ భద్రతను బలోపేతం చేయడమే ఈ సైనిక విస్తరణ వ్యూహంలో భాగంగా చెప్పవచ్చు.

Read Also : Indus Water Treaty : దాయాది పాక్‌కు భారత్ అల్టీమేటం.. సింధూ నదీ జలాల ఒప్పందంపై నోటీసులు..!